హిందూ జర్నలిజంగా మారిన.. హిందీ జర్నలిజం
కలం జర్నలిస్టులంతా… కర సేవకులుగా మారారా..? విధాత: గత కొంత కాలంగా జర్నలిజం గురించి అన్ని వర్గాల నుంచి పెదవి విరుపే కనిపిస్తున్నది. జర్నలిజం తన సహజ లక్షణం, ధర్మం నుంచి పక్కకు జరిగిన ఫలితమే నేటి దుస్థితి అనే స్థితి వచ్చంది. జరిగిన ఒక ఘటన గురించి మీడియాకొక తీరు వ్యక్తీకరణ కనిపిస్తున్నది. దాని వెనుక ఉన్నది దృష్టిలోపమా, ప్రయోజనమా? అన్నది ప్రశ్న. జాతీయోద్యమ కాలంలో ఉనికిలోకి వచ్చిన పత్రికా జర్నలిజం ప్రజాకాంక్షలోంచి పుట్టి పెరిగింది. […]

కలం జర్నలిస్టులంతా… కర సేవకులుగా మారారా..?
విధాత: గత కొంత కాలంగా జర్నలిజం గురించి అన్ని వర్గాల నుంచి పెదవి విరుపే కనిపిస్తున్నది. జర్నలిజం తన సహజ లక్షణం, ధర్మం నుంచి పక్కకు జరిగిన ఫలితమే నేటి దుస్థితి అనే స్థితి వచ్చంది. జరిగిన ఒక ఘటన గురించి మీడియాకొక తీరు వ్యక్తీకరణ కనిపిస్తున్నది. దాని వెనుక ఉన్నది దృష్టిలోపమా, ప్రయోజనమా? అన్నది ప్రశ్న. జాతీయోద్యమ కాలంలో ఉనికిలోకి వచ్చిన పత్రికా జర్నలిజం ప్రజాకాంక్షలోంచి పుట్టి పెరిగింది. ఆ మేరకు జాతీయోద్యమ ఆకాంక్షలకు ప్రతీకగా పనిచేసింది. స్వాతంత్ర్యానంతర కాలంలో అది యాజమాన్య ప్రయోజనాలకు అనుగుణంగా కుచించుకుపోయి.. నేడు అది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలకు ప్రతినిధిగా, ప్రతీకగా దిగజారిపోయింది.
ఇవ్వాళ.. దేశ వ్యాప్తంగానూ, ప్రాంతీయంగానూ ఉన్న పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల దాకా అన్నీ ఏదో ఒక పార్టీ రంగు పులుముకొని ఉన్న స్థితి. ఈ పరిస్థితుల్లో కర్ర ఎవనిదో బర్రె వానిదే అన్నట్లుగా.. పెద్ద కార్పొరేట్లదే రాజ్యం అయిపోయింది. దేశీయంగా చూస్తే.. హిందీ, ఇంగ్లిష్ మీడియా అంతా అధికార పార్టీకి వంతపాడటం మాత్రమే కాదు, వాటి భావజాల రాజకీయ ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఉన్నది నిష్పాక్షిక జర్నలిజం కాదు, అధికార వర్గాల బాకా. ఈ నేపథ్యంలో కలం కార్మికులు, సైనికులుగా చారిత్రక పాత్ర పోషించిన జర్నలిస్టులు ఇవ్వాళ కరసేవకులుగా మారిన వైనం కనిపిస్తున్నది. హిందీ జర్నలిజం అంతా హిందూ జర్నలిజంగా మారిపోయిన దుస్థితి.