జ్ఞానవాపి కేసు: హిందూ సంఘాల పిటిషన్ కొట్టివేత
విధాత: జ్ఞానవాపి మసీదులో గుర్తించిన శివలింగం కార్బన్ డేటింగ్‌ను కోరుతూ హిందూపక్షం వేసిన పిటిషన్ వారణాసి కోర్టు తిరస్కరించింది. శివలింగంపై కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ పరిశోధన కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించనటువుతుందని తెలిపింది. వజుఖాన ప్రాంగణాన్నిసీజ్ చేసి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. మసీదు ప్రాంగంలో వీడియోగ్రఫి సందర్భంగా వజుఖానా […]

విధాత: జ్ఞానవాపి మసీదులో గుర్తించిన శివలింగం కార్బన్ డేటింగ్‌ను కోరుతూ హిందూపక్షం వేసిన పిటిషన్ వారణాసి కోర్టు తిరస్కరించింది. శివలింగంపై కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ పరిశోధన కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించనటువుతుందని తెలిపింది. వజుఖాన ప్రాంగణాన్నిసీజ్ చేసి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. మసీదు ప్రాంగంలో వీడియోగ్రఫి సందర్భంగా వజుఖానా సమీపంలో శివలింగం కనిపించిదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దొరికింది శివలింగం కాదని ఫౌంటేయిన్ అని ముస్లిం వర్గం తెలిపింది. ఈ పరిస్థితిలో శివలింగంపై కార్బన్ డేటింగ్ జరిపించాలని సెప్టెంబర్ 22న హిందూపక్షం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని తాజాగా వారణాసి కోర్టు తోసి పుచ్చింది. ఒక పదార్థం ఎంత ప్రాచీనమైనదో తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారణ చేస్తారు.