Today Horoscope | ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి..!
Today Horoscope | మేషం : ఈ రాశి వారు దూకుడు ప్రదర్శిస్తారు. వాదనలకు దిగుతారు. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలు నిర్వహిస్తారు. మీ ఆత్మబంధువు నుంచి అందే ప్రత్యేక అతిథ్యముతో సంతోషిస్తారు. వృషభం : ఈ రాశివారు ప్రియమైన వ్యక్తితో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. కఠిన శ్రమ, సహనం మంచి ఫలితాలను ఇస్తుంది. కష్టతరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిథునం : ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు యోగా చేయాలి. […]

Today Horoscope |
మేషం : ఈ రాశి వారు దూకుడు ప్రదర్శిస్తారు. వాదనలకు దిగుతారు. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలు నిర్వహిస్తారు. మీ ఆత్మబంధువు నుంచి అందే ప్రత్యేక అతిథ్యముతో సంతోషిస్తారు.
వృషభం : ఈ రాశివారు ప్రియమైన వ్యక్తితో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. కఠిన శ్రమ, సహనం మంచి ఫలితాలను ఇస్తుంది. కష్టతరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మిథునం : ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు యోగా చేయాలి. ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ నిరాశ పడొద్దు. మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి.
కర్కాటకం : ఈ రాశి వారు మీ సిద్ధాంతాలతో రాజీ పడరు. అలా ఉన్నందుకు మీరు చాలా సంతృప్తి చెందుతారు. కానీ రాజీ ధోరణిని విడవకండి. అది మీ వృత్తిపరమైన వ్యవహారాల్లో సాయపడుతుంది.
సింహం : ఈ రాశివారు చిరాకుగా ఉంటారు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏదో ఒక కోర్సులో చేరే అవకాశం ఉంది. మీరు జరిపే సన్నిహిత సంభాషణ సంతోషానికి దారి తీస్తుంది.
కన్య : ఈ రాశి వారు శ్రేయోభిలాషులతో కలిసి పలు అంశాలపై చర్చిస్తారు. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అందులోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతారు.
తుల : ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఖర్చులు అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తిపరమైన చర్యల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం : మీ ప్రియమైన వ్యక్తితో ఇవాళ సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది.
ధనుస్సు : ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్ల గురించి ఆలోచిస్తారు. మనం చేస్తున్న వృత్తిలో భాగంగా టీమ్ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. అయితే మీ కృషి ఎవరికి కనబడదు. ఎటువంటి ప్రశంసలు కూడా పొందరు. ఇది నిరాశ కలిగిస్తుంది. కానీ మీ విలువేంటో మీకు తెలుస్తుంది.
మకరం : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. రాజకీయాల గురించి చర్చిస్తారు. భాగస్వామితో కలిసి షికారుకు వెళ్తారు. అనవసరమైన వాదనలకు దిగొద్దు.
కుంభం : ఈ రాశివారు ఇవాళ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. లీగల్ వ్యవహారాలు సెటిల్ అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మీనం : ఈ రాశి వారు ఇవాళ తీసుకునే నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.