11-03-2023 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వృత్తి రీత్యా ధన లాభం..!
మేష రాశి : మోసపోయే ప్రమాదం నుండి తప్పించుకుంటారు. పోలీస్ అధికారులకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శుభ కార్యచరణము చేస్తారు. ధన ప్రాప్తి వుంటుంది. వృషభ రాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆహ్లాదకరమైన సంభాషణలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం వుంటుంది. మిథున రాశి : యత్నకార్యభంగములు అశాంతిని కలిగిస్తాయి. కవులు, రచయితలకు గౌరవభంగములు కలుగవచ్చును. శరీర బలహీనతలు కలుగుతాయి. ఖర్చుల […]

మేష రాశి : మోసపోయే ప్రమాదం నుండి తప్పించుకుంటారు. పోలీస్ అధికారులకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శుభ కార్యచరణము చేస్తారు. ధన ప్రాప్తి వుంటుంది.
వృషభ రాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆహ్లాదకరమైన సంభాషణలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం వుంటుంది.
మిథున రాశి : యత్నకార్యభంగములు అశాంతిని కలిగిస్తాయి. కవులు, రచయితలకు గౌరవభంగములు కలుగవచ్చును. శరీర బలహీనతలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో కఠినంగా ఉంటారు.
కర్కాటక రాశి : ఎముకలు, నరాల బలహీనతలు బాధిస్తాయి. చెప్పుడు మాటల వలన ఇబ్బందులనెదుర్కొంటారు. బహుముఖ ధన వ్యయము ఆందోళన కలిగిస్తుంది. మనశ్శాంతి వుండదు.
సింహ రాశి : కోపమును ప్రదర్శించడం వలన పనులు చక్కబడతాయి. గృహమందు శాంతి లభిస్తుంది. భాగస్వాములతో సంభాషణలు సత్ఫలితాలనిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి ఆనందాన్నిస్తుంది.
కన్యా రాశి : గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. స్థిరాస్థి మూలక అశాంతి కలుగుతుంది. అధికారుల మూలకంగా భయము కలుగవచ్చును. దుర్జన మూలక బాధలు కలుగుతాయి. వృథా సంచారములుంటాయి.
తులా రాశి : పట్టుదలతో పనులు నిర్వహిస్తారు. వాక్చాతుర్యాన్ని కలిగి వుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఆనందాన్నిస్తుంది. బహుమానములను పొందుతారు. ఆనందమయంగా రోజంతా గడుపుతారు.
వృశ్చిక రాశి : కపటత్వము కలిగిన వారిని దూరంగా ఉంచుతారు. వివామ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎన్నో రోజుల నుండి వాయిదా పడుతున్న పనులు పూర్తయ్యే అవకాశముంది. వృత్తి రీత్యా ధనలాభము కలుగుతుంది.
ధనుస్సు రాశి : గృహమూలక సౌఖ్యం కలుగుతుంది. శుభ కార్యమూలక ప్రయాణాలు కలుగుతాయి. సొదరుల సహకారం లభిస్తుంది. నూతన వాహన ప్రయత్నాలు చేస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది.
మకర రాశి : ఆత్మాభిమానమును నిలుపుకుంటారు. ప్రయత్న కార్యములలో ఆటంకాలెదురైననూ ధైర్యంగా ముందుకు వెళతారు. పెద్దల ఆదరణ లభిస్తుంది. రాదనుకున్న ధనము చేతికందుతుంది. మనోల్లాసము కలుగుతుంది.
కుంభ రాశి : పితృవర్గము వారితో విభేదాలు కలుగవచ్చును. సత్ప్రవర్తనను కలిగి వుంటారు. నూతనోత్సాహము వ్యాపారులకు లాభాలనిస్తుంది. వివాహ ప్రయత్నాలలో ఇతరుల సహాయమును కోరతారు.
మీన రాశి : మోకాళ్ళు నొప్పులు బాధిస్తాయి. ఏకాగ్రత లోపించడం వలన ఏ పనీ పూర్తికాదు. నిందా వ్యాఖ్యలను వినవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మూలకంగా అశాంతి కలుగవచ్చును.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.