తేది 13.02.2023 సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి భారీగా ధనలాభం

మేషం : పెద్దలతో గౌరవంగా నడుచుకుంటారు. మీ ప్రజ్ఞా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల మూలక లాభములుంటాయి. శుభకార్యములక ధనవ్యయముంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభం : వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. శరీర ఆరోగ్యముతో ఉల్లాసం లభిస్తుంది. శతృవులతో సంధి ఏర్పడే అవకాశాలు. ఇంటికి సంబంధించిన‌ పనులపై శ్రద్ధ పెరుగుతుంది. బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు. మిధునం : వ్యాపార వ్యవహారాలలో వివాదాలు చోటు చేసుకుంటాయి. భయం మూలకంగా సుబ్ధంగా వుంటారు మనశ్చాంచల్యము కలుగుతుంది. […]

తేది 13.02.2023 సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి భారీగా ధనలాభం

మేషం : పెద్దలతో గౌరవంగా నడుచుకుంటారు. మీ ప్రజ్ఞా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల మూలక లాభములుంటాయి. శుభకార్యములక ధనవ్యయముంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం : వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. శరీర ఆరోగ్యముతో ఉల్లాసం లభిస్తుంది. శతృవులతో సంధి ఏర్పడే అవకాశాలు. ఇంటికి సంబంధించిన‌ పనులపై శ్రద్ధ పెరుగుతుంది. బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిధునం : వ్యాపార వ్యవహారాలలో వివాదాలు చోటు చేసుకుంటాయి. భయం మూలకంగా సుబ్ధంగా వుంటారు మనశ్చాంచల్యము కలుగుతుంది. జ్వరాది స్వల్ప దేహబాధలుండవచ్చును. ఆర్థిక వ్యవ‌హారాలు ప్రతికూలిస్తాయి. సోమరితనము వలను పనులు ఆలస్యమౌతాయి.

కర్కాటకం : ప్రభుత్వ కార్యాలయాలలో పనులు తొందరగా పూర్తి కాక‌పోవడం వలన అశాంతికిలోనౌతారు. వాహన మూలక అసౌకర్యము ఏర్పడవచ్చును. ప్రయాణములు ఎక్కువ. రాజకీయ నాయకులకు అనుకోని ఇబ్బందులు కలుగవచ్చును.

సింహం : కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వ్యక్తులతో కలయికలుంటాయి. సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. మనోల్లాసము లభిస్తుంది. వైద్యరంగంలోని వారికి అనుకూల వాతావరణముంటుంది.

కన్య : మీ మాటతీరుపై విమర్శలు రావచ్చును. శరీరబాధలకు ఔషధ సేవనము చేయుదురు. వస్తు నష్టములు, ధనవ్యయము కలుగవచ్చును. స్థిరాస్థి వ్యవహారముల‌ను వాయిదా వేయడం మంచిది. కుటుంబ మూలకు అశాంతి ఏర్పడవచ్చును.

తుల : అద్భుతమైన ప్రసంగాలను వింటారు. ఆనందమయమైన జీవనము లభిస్తుంది. శరీరోల్లాసము కలుగుతుంది. తృప్తికరమైన భోజనం లభిస్తుంది. బహుమానములు పొందుతారు. ధనప్రాప్తి కలుగుతుంది.

వృశ్చికం : బంధు మిత్రుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. దూర ప్రయాణములు చేయకపోవడం మంచిది. చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేయవలసి వస్తుంది. కోపంవలన అవమానములను ఎదుర్కొంటారు.

ధ‌నుస్సు : క్రయ విక్రయములు మూలకంగా లాభముంటుంది. శుభకార్యములకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులు ఇంటికి రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబముతో కలిసి ఉల్లాసంగా వుంటారు.

మకరం : సన్మాల‌ను పొందే అవకాశము. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రయత్నకార్యములు సిద్ధిస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించే అవకాశం లభిస్తుంది. అక్కాచెల్లెలల సహకారం ఆనందాన్ని కలిగిస్తుంది.

కుంభం : వాహన మూలక చికాకులు కలుగుతాయి. పితృ వర్గము వారితో విభేదాలు. శరీరమందు వేడి వలన బలహీనత కలుగవచ్చును. శ్రమ ఎక్కువగా వుంటుంది. గుర్తింపు తక్కువగా వుంటుంది. కార్యసిద్ధికై ఇతరులను ఆశ్రయించవలసి వస్తుంది.

మీనం : వివాహ ప్రయత్నములు వాయిదా వేయడం మంచిది. వాక్కాఠిన్యము వలన ఇబ్బందులెదుర్కొంటారు. వృథావ్యయము కలుగుతుంది. భోజనము రుచింప‌దు. విమర్శలనెదుర్కొంటారు.