28.03.2023 మంగళవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనవసర ధనవ్యయము

మేష రాశి:- ప్రభుత్వఉద్యోగులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. కావాల్సిన ధనం సకాలంలో చేతి కందుతుంది. మంచి పనులు చేయు అవకాశం లభిస్తుంది. వృషభ రాశి:- ఇష్టమైన వస్తువులు నష్టమగును. అపవాదుల మూలకంగా మనోశ్లోభ ఉంటుంది. వ్యాపారస్థులకు అనుకూలముగా సమయం కాదు. భయం వలన కార్యభంగములు క‌లుగవచ్చును. శరీర అలసట ఎక్కువ. మిథున రాశి: కోర్టు కేసులను వాయిదా వేసుకోవడం మంచిది. సంభాషలలో మాటలను అదుపులో ఉంచుకోనుట మంచిది. మీకు తెలియకుండానే […]

28.03.2023 మంగళవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనవసర ధనవ్యయము

మేష రాశి:- ప్రభుత్వఉద్యోగులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. కావాల్సిన ధనం సకాలంలో చేతి కందుతుంది. మంచి పనులు చేయు అవకాశం లభిస్తుంది.

వృషభ రాశి:- ఇష్టమైన వస్తువులు నష్టమగును. అపవాదుల మూలకంగా మనోశ్లోభ ఉంటుంది. వ్యాపారస్థులకు అనుకూలముగా సమయం కాదు. భయం వలన కార్యభంగములు క‌లుగవచ్చును. శరీర అలసట ఎక్కువ.

మిథున రాశి: కోర్టు కేసులను వాయిదా వేసుకోవడం మంచిది. సంభాషలలో మాటలను అదుపులో ఉంచుకోనుట మంచిది. మీకు తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెడుదురు, ఆలోచనలు ఎక్కువగా వుండవచ్చును.

కర్కాటక రాశి:- దూరప్రాంతాల‌ నుంచి శుభవార్తలు వింటారు. నూతన వస్తువులను పొందుతారు. ఆత్మస్థైర్యము వుంటుంది. ఇష్టమైన వ్యక్తులకు మీ అంతరంగాన్ని వెల్లడిస్తారు. భూసంబంధమైన వ్యవహారాలకు అనుకూలంగా వుంటుంది.

సింహ రాశి:- ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవటం వలన నిరాశ పొందుతారు, గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందలను వినవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చును.

క‌న్యా రాశి:- రాజకీయ నాయకులకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గౌరవము పెరుగుతుంది. నూతన కార్యారంభమునకు అనుకూలము. బహుమానములను పొందుతారు. శుభకార్యములకు ధనాన్ని వెచ్చిస్తారు.

తులారాశి:- దూరప్రయాణాలు వెల్లవలసి వస్తుంది. దుర్జ‌నుల సహవాసము కలుగుతుంది. ఒళ్ళుఇప్పులు బాధించవచ్చును. కొన్ని వివాదములలో తలదూర్చవలసి రావచ్చును. అనవసర ధనవ్యయము కలుగవచ్చును.

వృశ్చిక రాశి:- ప్రముఖులతో కలయికలు. దానధర్మాది పుణ్యకార్యములను ఆచరించెదరు. ఇంట్లో శుభకార్యములు లేదా బంధుమిత్రుల కలయికలు వుండవచ్చును. సంతానమునకు సంతోషాన్ని కలిగిస్తాను, ఆనందంగా రోజు గడుస్తుంది.

ధనుస్సు రాశి:- తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్ర‌యత్నాలు ప్రారంభిస్తారు. శరీర సౌఖ్యము వుంటుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకొంటారు.

మకర రాశి:- సోద‌ర వర్గము వారితో అభిప్రాయ భేదాలు క‌లుగుదతాయి. ఉద్యోగములో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకొని సమస్యలు ఎదుర్కొంటారు. పరస్థలంలో గడపవలసి వస్తుంది. అనారోగ్య భయము వుంటుంది.

కుంభ రాశి:- క్రీడాకారులకు ఇబ్బందులెదురవుతాయి, శరీరంలో వాత బాధలు కలుగవచ్చును. ఇష్టములేని పనులు చేయవలసి వస్తుంది. భయం మూలకంగా పనులు ఆలస్యం కావచ్చును. శ‌త్రవులతో వివాదాలు పెరగవచ్చును.

మీన రాశి:- రాజకీయ నాయకులు ఆదరణ‌ పనులు పూర్త‌వుతాయి. భూవివాదాలు. పరిష్కారమయ్యే సూచనలు. కీర్తి, సన్మానములు పొందుదురు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపెదరు, రాద‌నుకున్న ధనము చేతికందుతుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.