రేపు హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు
శుక్రవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు రాజకీయరంగు పులుముకోగా, బీఆరెస్, బీజేపీ మద్దతులతో ఎన్నికల్లో పోటాపోటీ నెలకొంది

విధాత : శుక్రవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు రాజకీయరంగు పులుముకోగా, బీఆరెస్, బీజేపీ మద్దతులతో ఎన్నికల్లో పోటాపోటీ నెలకొంది. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్ పేరుతో జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. తమ ప్యానెల్ కు ప్రభుత్వం మద్దతు ఉందని చెబుతున్నారు. అధ్యక్షునిగా జగన్మోహన్‌రావు, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీధర్, సెక్రటరీగా హరినారాయణ రావు, ట్రెజరర్ గా శ్రీనివాసరావు ,జాయింట్ సెక్రటరీగా నోయల్ డేవిడ్, కౌన్సిలర్ గా వినోద్ అన్సారీ, అహ్మద్ ఖాన్ లు పోటీ పడుతున్నారు. బీజేపీ మద్దతుతోఒ అనిల్ కుమార్ ప్యానెల్ పోటీ చేస్తుండగా, హెచ్‌సీఐ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి మద్దతుతో అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.
వైస్ ప్రెసిడెంట్‌గా దల్జిత్ సింగ్, సెక్రటరీగా ఆగం రావు, ట్రెజరర్ గా మహేంద్ర, జాయింట్ సెక్రటరీగా బసవరాజు, కౌన్సిలర్ గా వినోద్ ఇంగ్లే పోటీ చేస్తున్నారు. మరోవైపు క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ల ప్యానల్ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా జి. శ్రీనివాస్ ,ట్రెజరర్ గా సంజీవన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చిట్టి శ్రీధర్, కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ పోటీ చేస్తున్నారు. జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా ఇంకోవైపు నాగేశ్వర్‌రావు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మాజీ అధ్యక్షుడు అజారుద్ధిన్‌తో పాటు పలువురిపై నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేయడం గమనార్హం. నేడు జరుగనున్న ఎన్నికల నేపధ్యంలో స్థానిక పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.