రూ. 12 కోట్ల ఖ‌రీదైన కారును కొన్న హైద‌రాబాదీ వ్యాపారి

MCLAREN 765LT SPIDER | హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన వ్యాపార‌వేత్త న‌సీర్ ఖాన్‌.. అత్యంత ఖ‌రీదైన కారును కొనుగోలు చేశారు. రూ. 12 కోట్ల ఖరీదైన కారును ఖాన్ కొనుగోలు చేసి, ఫ‌ల‌క్‌నూమా ప్యాలెస్ వ‌ద్ద డెలివ‌రీ పొందాడు. మెక్ లారెన్ 765 ఎల్‌టీ స్పైడ‌ర్ కారును కొనుగోలు చేసిన‌ట్లు న‌సీర్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా వెల్ల‌డించాడు. ఇండియాలో ప్ర‌స్తుత మార్కెట్ ప్ర‌కారం అత్యంత ఖ‌రీదైన సూప‌ర్ కార్ల‌లో ఈ కారు ఒక‌టి. ఈ ఎల‌క్ట్రిక్ […]

రూ. 12 కోట్ల ఖ‌రీదైన కారును కొన్న హైద‌రాబాదీ వ్యాపారి

MCLAREN 765LT SPIDER | హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన వ్యాపార‌వేత్త న‌సీర్ ఖాన్‌.. అత్యంత ఖ‌రీదైన కారును కొనుగోలు చేశారు. రూ. 12 కోట్ల ఖరీదైన కారును ఖాన్ కొనుగోలు చేసి, ఫ‌ల‌క్‌నూమా ప్యాలెస్ వ‌ద్ద డెలివ‌రీ పొందాడు. మెక్ లారెన్ 765 ఎల్‌టీ స్పైడ‌ర్ కారును కొనుగోలు చేసిన‌ట్లు న‌సీర్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా వెల్ల‌డించాడు. ఇండియాలో ప్ర‌స్తుత మార్కెట్ ప్ర‌కారం అత్యంత ఖ‌రీదైన సూప‌ర్ కార్ల‌లో ఈ కారు ఒక‌టి.

ఈ ఎల‌క్ట్రిక్ హార్డ్ టాప్‌ కారు ఓపెన్ కావ‌డానికి 11 సెక‌న్ల స‌మ‌యం ప‌డుతుంది. కార్బ‌న్ ఫైబ‌ర్‌తో బాడీని త‌యారు చేశారు. కారు బంపర్‌, స్పిల్టర్‌, సైడ్‌ స్కిర్ట్స్‌, రాప్‌రౌండ్‌ రేర్‌ బంపర్స్‌ చాలా దృఢంగా ఉంటాయి. కారును కూపే వర్షన్‌లో రూపొందించారు. రెడ్‌షేడ్‌తో స్పోర్టీ లుక్‌లో కారు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

ఇప్ప‌టికే న‌సీర్ ఖాన్ గ్యారేజీలో రోల్స్ రాయిస్ క‌లిన‌న్ బ్లాక్ బ్యాడ్జ్‌, ఫెరారీ 812 సూప‌ర్ ఫాస్ట్‌, మెర్సిడీజ్-బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టాంగ్‌, లాంబోర్గిని అవెంట‌డార్‌, లాంబోర్గిని ఉరుస్ లాంటి ఎన్నో ఖ‌రీదైన కార్లు ఉన్నాయి.

మెక్‌లారెన్ సంస్థ ఇండియా మార్కెట్‌లోకి గతేడాది ప్ర‌వేశించింది. గ‌తేడాది బెంగాల్‌కు చెందిన వ్యాపార‌వేత్త ప్ర‌వీణ్ అగ‌ర్వాల్‌కు 720ఎస్ స్పైడ‌ర్ మోడ‌ల్ కారును మెక్‌లారెన్ అంద‌జేసింది. 765ఎల్టీ స్పైడ‌ర్‌ను కొనుగోలు చేసిన తొలి భార‌తీయ వ్య‌క్తి న‌సీర్ ఖాన్ కావ‌డం విశేషం.