Hyderabad | మంత్రి KTR నమ్మక ద్రోహం చేశారు: మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం
Hyderabad | దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోలేదు పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యాయత్నం… చేసిన ఆరిజన్ డైయిరీ సీఈవో శేజల్ విధాత: పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశాడంటూ సూసైడ్‌నోట్ రాసి… అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్నఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని […]

Hyderabad |
- దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోలేదు
- పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు
- సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యాయత్నం…
- చేసిన ఆరిజన్ డైయిరీ సీఈవో శేజల్
విధాత: పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశాడంటూ సూసైడ్‌నోట్ రాసి… అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్నఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆమె బ్యాగులో నిద్ర మాత్రలు, సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. 1.30 గంటలకు శేజల్‌ను ఆదినారాయణ అనే వ్యక్తి పెద్దమ్మ గుడి వద్ద దించి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని మాట తప్పారు
Watch video>>https://t.co/j9L6gicy8O#Shejal #MLADurgamChinnaiah #Sucide #NTVNews #NTVTelugu
— NTV Telugu (@NtvTeluguLive) June 29, 2023
శేజల్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే…
ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పుడు మంత్రి కేటీఆర్ నన్ను కలిశారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. దుర్గం చిన్నయపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. నన్ను హైదరాబాద్ వెళ్ళిపొమ్మని చెప్పారు.
వారం రోజులకి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కానీ మొన్న కేటీఆర్ చేసిన వాఖ్యలు నన్ను నమ్మకద్రోహం చేసినట్టు అనిపించింది. నామీద లైంగిక దాడి జరగలేదు అని చెప్పాడు. నన్ను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడు. నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు. పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు” అని శేజల్ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
Shejal:ఆ ఎమ్మెల్యే పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శేజల్ ఆత్మహత్యాయత్నం..!#Sejal #SejalIncident #DurgamChinnaiah #Telangana #Oneindiatelugu pic.twitter.com/N8Smf0a2TU
— oneindiatelugu (@oneindiatelugu) June 29, 2023