Narayana | నేను అభిమానిని, కార్యకర్తను.. అయినా స్పందించరేంటి: పవన్‌ను ప్రశ్నించిన కృష్ణ ప్రియ
Narayana | నాకే చేయలే.. రేపు జనాలకు న్యాయం ఎలా చేస్తారు తన బావ నారాయణ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన మరదలు కృష్ణ ప్రియ తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకూ కేసు రిజిస్టర్ చేయలేదని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ మీద కూడా ఆరోపణలు గుప్పించారు. ప్రజలకు కష్టం వస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తన విషయంలో ఎందుకు స్పందించడం లేదని […]

Narayana |
నాకే చేయలే.. రేపు జనాలకు న్యాయం ఎలా చేస్తారు
తన బావ నారాయణ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన మరదలు కృష్ణ ప్రియ తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకూ కేసు రిజిస్టర్ చేయలేదని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ మీద కూడా ఆరోపణలు గుప్పించారు.
ప్రజలకు కష్టం వస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తన విషయంలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. తాను జనసేనకు, పవన్ కళ్యాణ్ కు అభిమానినని చెబుతూ అలాంటి యాక్టివ్ కార్యకర్త అయిన తనకు అన్యాయం జరిగితేనే ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఒకవేళ సీఎం అయితే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
ఇక హైదరాబాద్ పోలీసులు ఎవరి ఒత్తిడికి లొంగిపోయారో చెప్పాలి అంటూ ఒక వీడియో మెసేజ్ ఆమె రిలీజ్ చేశారు. కేసీఆర్.. కేటీఆర్.. హరీష్ రావు .. జగన్ మోహాన్ రెడ్డి .. చివరకు పవన్ కళ్యాణ్ .. ఎవరు చెబితే తన ఫిర్యాదును పక్కన పెట్టేశారని ప్రశ్నించారు.
అంతేకాకుండా నారాయణ మెడికల్ కాలేజీలో సైతం మహిళా డాక్టర్లు, ప్రొఫెసర్లకు నారాయణ నుంచి లైంగిక వేధింపులు తప్పలేదని, అయన వేధింపులు భరించలేక చాలామంది సీనియర్ డాక్టర్స్ కాలేజీ వదిలి వెళ్లిపోయారని ఆమె ఆరోపించారు.
ఈసారి పవన్ కు ఓటెయ్యకపోతే తమ బంధువులను సైతం బహిష్కరిస్తానని గతంలో హెచ్చరించాను. కానీ ఇప్పుడు పవన్ తీరు చూస్తుంటే తనకు బాధగా ఉందని, తనలాంటి అభిమాని విషయంలోనే ఇలా ఉంటె బయటి జనాల విషయంలో అయన ఎలా ఉంటారో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.