Bhumana Karunakara Reddy | విమర్శలకు భయపడను.. టీటీడీ చైర్మన్ భూమన

Bhumana Karunakara Reddy | నా గత హయాంలో చేసిన సేవలు చూడండి విమర్శకులకు భూమన స్ట్రాంగ్ రిప్లై విధాత:  తనను క్రైస్తవుడు అని, నాస్తికుడు, దేవుడినే నమ్మనివాడు అని తన కుమార్తె క్రైస్తవ విధానంలో పెళ్లి చేసుకుందని.. తిరుమల మొత్తం క్రైస్తవం చేసేస్తున్నారు అంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలకు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గట్టి రిప్లై ఇచ్చారు.  తాను 17 సంవత్సరాల క్రితమే, వైయస్ రాజశఖరరెడ్డి హయాంలో చైర్మన్‌ గా పని చేశానని […]

  • By: krs    latest    Aug 27, 2023 11:53 AM IST
Bhumana Karunakara Reddy | విమర్శలకు భయపడను.. టీటీడీ చైర్మన్ భూమన

Bhumana Karunakara Reddy |

  • నా గత హయాంలో చేసిన సేవలు చూడండి
  • విమర్శకులకు భూమన స్ట్రాంగ్ రిప్లై

విధాత: తనను క్రైస్తవుడు అని, నాస్తికుడు, దేవుడినే నమ్మనివాడు అని తన కుమార్తె క్రైస్తవ విధానంలో పెళ్లి చేసుకుందని.. తిరుమల మొత్తం క్రైస్తవం చేసేస్తున్నారు అంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలకు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గట్టి రిప్లై ఇచ్చారు. తాను 17 సంవత్సరాల క్రితమే, వైయస్ రాజశఖరరెడ్డి హయాంలో చైర్మన్‌ గా పని చేశానని గుర్తు చేశారు.

ఆరోజుల్లో 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించినట్లు వివరించారు. ఇదే సమయంలో తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని, ఇంకా అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపింది కూడా తానేనని వివరించారు.

దళిత వాడల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించింది తానేనని తెలిపారు. అలాంటి తనను క్రిస్టియన్ అని, నాస్తికుడు అని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానం అని వివరించారు. టిటిడి భక్తి ఛానల్ ఏర్పాటు కూడా తన హయాంలో జరిగిందని అన్నారు.

ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.