ఐరన్‌మ్యాన్ చేస్తా: రాంచరణ్
విధాత: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని, ఆయన మార్వెల్ స్టూడియోతో ఒక పాత్ర కోసం ఒప్పందం అయ్యిందని ఎప్పటినుండో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందం గురించే రామ్ చరణ్ పరోక్షంగా అభిమానులకు తాజాగా హింట్ ఇచ్చాడా? అనే చర్చ సాగుతోంది. ఇక విషయానికి వస్తే గత ఏడాది విడుదలైన RRR చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి […]

విధాత: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని, ఆయన మార్వెల్ స్టూడియోతో ఒక పాత్ర కోసం ఒప్పందం అయ్యిందని ఎప్పటినుండో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందం గురించే రామ్ చరణ్ పరోక్షంగా అభిమానులకు తాజాగా హింట్ ఇచ్చాడా? అనే చర్చ సాగుతోంది. ఇక విషయానికి వస్తే గత ఏడాది విడుదలైన RRR చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టింది.
ఇక ఈ చిత్రం ఓటిటిలో ప్రత్యక్షమైన క్షణం నుంచి ఈ చిత్రానికి విదేశీయుల ఆదరణ కూడా లభించడం మొదలయ్యింది. హాలీవుడ్‌కి చెందిన టెక్నీషియన్స్, క్రిటిక్స్, హాలీవుడ్ నటులు కూడా ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు. అలా అంతర్జాతీయ అవార్డ్స్ కూడా ఈ చిత్రం ఎంపికయింది. తాజాగా ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరోలు ఇద్దరికీ కూడా సరి సమానమైన ఇమేజ్ దక్కింది. పాత్ర పరంగా నిడివి ఎక్కువగా ఉండటంతో రామ్ చరణ్‌కి కాస్త ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చాయని అంటున్నారు.
తాజాగా రామ్ చరణ్‌కు హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయట. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల హాలీవుడ్ మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు హాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తే నటిస్తారా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురయింది.
దానికి రామ్ చరణ్ స్పందిస్తూ చాలా హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ మంచి కథ కోసం చూస్తున్నాను. కచ్చితంగా చేసే పరిస్థితులు వస్తే చాన్స్ వదులుకోనని సమాధానం ఇచ్చాడు. మార్వెల్ మూవీస్‌లో సూపర్ హీరో పాత్ర పోషించే అవకాశం వస్తే మీరు ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటారు? అని మీడియా అడిగితే నేను ఐరన్ మ్యాన్ పాత్ర చేస్తానని బదులిచ్చాడు.
తనకు కెప్టెన్ అమెరికా చిత్రం అంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పాడు రామ్ చరణ్. మొత్తానికి ఈ సమాధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే మెగా అభిమానులలో చరణ్ జోష్ నింపాడు. మరి ఇది నిజమయ్యే శుభ తరుణం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.