డ్ర‌గ్స్ టెస్టు కోసం ర‌క్తం, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధం.. బండి సంజ‌య్‌కు KTR స‌వాల్

విధాత: త‌న‌పై బండి సంజయ్ చేసిన డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష కోసం త‌న ర‌క్తం, గోర్లు, వెంట్రుక‌లు, చివ‌ర‌కు కిడ్నీ కూడా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఒక వేళ తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని తేలితే.. క‌రీంన‌గ‌ర్ క‌మాన్ వ‌ద్ద బండి సంజ‌య్ చెప్పుతో కొట్టుకుంటాడా? అని కేటీఆర్ స‌వాల్ విసిరారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేందంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో […]

  • By: krs    latest    Dec 20, 2022 12:37 PM IST
డ్ర‌గ్స్ టెస్టు కోసం ర‌క్తం, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధం.. బండి సంజ‌య్‌కు KTR స‌వాల్

విధాత: త‌న‌పై బండి సంజయ్ చేసిన డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష కోసం త‌న ర‌క్తం, గోర్లు, వెంట్రుక‌లు, చివ‌ర‌కు కిడ్నీ కూడా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

ఒక వేళ తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని తేలితే.. క‌రీంన‌గ‌ర్ క‌మాన్ వ‌ద్ద బండి సంజ‌య్ చెప్పుతో కొట్టుకుంటాడా? అని కేటీఆర్ స‌వాల్ విసిరారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేందంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో బండి సంజ‌య్ చేసిన డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై కేటీఆర్‌ను ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.

డ్ర‌గ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా..నేను చిత్త‌శుద్ధిగా బ‌య‌ట‌కు వ‌స్తా.. అప్పుడు క‌రీంన‌గ‌ర్ చౌర‌స్తాలో చెప్పు దెబ్బ‌లు తింటాడా..? నా ర‌క్తం, నా చ‌ర్మం తీసుకుపోతాడా..? ఏం తీసుకుపోత‌డో తీసుక‌పొమ్మ‌ను. నా వెంట్రుక‌లు కూడా ఇస్తా. నేను బ‌య‌ట‌కు చిత్త‌శుద్ధితో వ‌చ్చిన త‌ర్వాత క‌రీంన‌గ‌ర్ చౌర‌స్తాలో క‌మాన్ ద‌గ్గ‌ర చెప్పు దెబ్బ‌లు తిన‌డానికి సిద్ధ‌మేనా..? నా చెప్పు దెబ్బ‌లు కాదు.. ఆయ‌న చెప్పుతోనే ఆయ‌న కొట్టుకుంటాడా..? క‌రీంన‌గ‌ర్ క‌మాన్ వ‌ద్ద కొట్టుకోవాలి.

దీనికి సిద్ధ‌మైతే నేను ఇక్క‌డ్నే ఉంటాను. ర‌మ్మ‌ను. ఏ డాక్ట‌ర్ను తీసుకోస్త‌డో తీసుకుర‌మ్మ‌ను. నా వెంట్రుక‌లు, నా ర‌క్తం, నా గోర్లు, అవ‌స‌ర‌మైతే కిడ్నీ కూడా ఇస్తా. ఆయ‌న‌కు ఏమైనా తెలివి ఉందా? ఇదేం రాజ‌కీయం.. మ‌నిషా ప‌శువా.. క‌రీంన‌గ‌ర్‌కు ఏం చేసిండో చెప్ప‌నికి చేత కాదు.. కానీ అరుపులు, పెడ‌బొబ్బ‌లు పెడుతుండు అని కేటీఆర్ ఘాటుగా బ‌దులిచ్చారు.