Tina Dabi | తల్లైన ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి.. పండంటి మగబిడ్డకు జన్మ
Tina Dabi | ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి గుర్తుందా..? దళిత కుటుంబానికి చెందిన ఆమె.. 2015 యూపీఎస్సీ ఫలితాల్లో టాప్ ర్యాంకర్. తొలుత బ్యాచ్‌మేట్ అతర్ అమిర్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సీనియర్ ఆఫసర్ ప్రదీప్ గవాండేను రెండో పెళ్లి చేసుకున్నది. సోషల్ మీడియాలో ఆ జంట పాపులర్ అయిన విషయం తెలిసిందే. మొత్తంగా సోషల్ మీడియాలో పాపులరిటీ సంపాదించుకున్న ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి ఇప్పుడు తల్లి అయ్యారు. శుక్రవారం […]

Tina Dabi |
ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి గుర్తుందా..? దళిత కుటుంబానికి చెందిన ఆమె.. 2015 యూపీఎస్సీ ఫలితాల్లో టాప్ ర్యాంకర్. తొలుత బ్యాచ్‌మేట్ అతర్ అమిర్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సీనియర్ ఆఫసర్ ప్రదీప్ గవాండేను రెండో పెళ్లి చేసుకున్నది. సోషల్ మీడియాలో ఆ జంట పాపులర్ అయిన విషయం తెలిసిందే.
మొత్తంగా సోషల్ మీడియాలో పాపులరిటీ సంపాదించుకున్న ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి ఇప్పుడు తల్లి అయ్యారు. శుక్రవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ప్రదీప్ గవాండే, టీనా దాబి ఆనందంలో మునిగిపోయారు.
అమీర్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న టీనా దాబి.. కొవిడ్ టైంలో ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ సాధించారు ఆయన. ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్‌లో ప్రదీప్ పని చేస్తున్నారు. టీనా దాబి కూడా రాజస్థాన్‌లోనే పని చేస్తున్నారు.
జైసల్మేర్‌లో కలెక్టర్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సమయంలోనే టీనా గర్భం దాల్చడంతో.. సెలవు మీద వెళ్లారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సహకరించిన ఉద్యోగులకు, స్థానికులకు టీనా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.