Sreeleela | ఆ సినిమా శ్రీలీల చేసి ఉంటే.. ఈ పాటికి రష్మిక పెళ్లి అయిపోయేది
Sreeleela విధాత: వరుస సినిమాలతో బిజీగా మారిపోవడమూ, ఎప్పుడో ఆ సినిమా చేసి ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదని అనుకోవడమూ మామూలే సినీ జనాలకు. ప్రస్తుతం వాళ్ళున్న పొజిషన్ గురించి కాకుండా.. అప్పట్లో అంటూ వదులుకుని, చేయలేకపోయిన సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదృష్టం కలిసిరాకపోతే ఒక్కోసారి కొన్ని మంచి ఛాన్స్‌లు మిస్ అవడం కామనే. అలాంటిదే శ్రీలీల లైఫ్‌లోనూ జరిగింది. శ్రీలీల మిస్ చేసుకున్న ఓ సినిమా గురించి కొన్ని రోజులుగా భారీగా వార్తలు […]

Sreeleela
విధాత: వరుస సినిమాలతో బిజీగా మారిపోవడమూ, ఎప్పుడో ఆ సినిమా చేసి ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదని అనుకోవడమూ మామూలే సినీ జనాలకు. ప్రస్తుతం వాళ్ళున్న పొజిషన్ గురించి కాకుండా.. అప్పట్లో అంటూ వదులుకుని, చేయలేకపోయిన సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదృష్టం కలిసిరాకపోతే ఒక్కోసారి కొన్ని మంచి ఛాన్స్‌లు మిస్ అవడం కామనే.
అలాంటిదే శ్రీలీల లైఫ్‌లోనూ జరిగింది. శ్రీలీల మిస్ చేసుకున్న ఓ సినిమా గురించి కొన్ని రోజులుగా భారీగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆ సినిమా కనుక శ్రీలీల చేసి ఉంటే.. ఈ పాటికి రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయ్యేది అంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ సరదాగా అనిపిస్తున్నాయి.
విషయంలోకి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ తెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల గురించి పూటకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు గతంలో ఓ సినిమా గనక చేసి ఉంటే ఈపాటికి అమ్మడి పేరు స్టార్ హీరోయిన్‌గా గొప్ప క్రేజ్ తెచ్చుకునేదని, టాప్ హీరోయిన్ ఫ్లేస్‌లో నిలిచేదనేలా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ సినిమా ఏదో కాదు.. ‘ఛలో’.
Pooja Hegde | ఆ హీరోయిన్ దెబ్బకి.. పూజా హెగ్డేకు మెంటలెక్కిపోతోంది
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్ళిసందD’ తర్వాత రవితేజతో చేసిన ‘ధమాకా’తో ధమాకా వంటి హిట్‌ని సొంతం చేసుకుని.. ఒవర్ నైట్ పాపులారిటీ తెచ్చేసుకుంది శ్రీలీల. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్‌కి దక్కని ఛాన్స్‌లు చేజిక్కించుకుంటూ, మాంచి ఊపుమీదుంది. ఇక ఆమె వదులుకున్న సినిమా సంగతికొస్తే.. నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను అనుకుంటే.. చదువు కారణంగా కుదరక, ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందట.
దీంతో ఆ ఛాన్స్ రష్మికను ఎంచుకునేలా చేసిందట. ‘ఛలో’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రష్మిక స్టార్ హీరోల సరసన, వరుస అవకాశాలతో దూసుకుపోతుందని, అదే సినిమా రష్మిక కాకుండా శ్రీలీల చేసి ఉండి ఉంటే ఎప్పుడో నేషనల్ క్రష్ గా పిలిపించుకునేదని సినీ జనాల గుసగుసలాడుతున్నారు.
Sree Leela | శ్రీలీలకు.. బోల్ట్ కంటెంట్ సినిమా ఆఫర్! 100 కోట్లిచ్చినా దిగజారలేనన్న టాలీవుడ్ క్రష్
అయితే ‘ఛలో’ సినిమా గురించి, అది సాధించిన విజయాన్ని గురించి గుర్తుచేసుకుంటూ స్వయంగా హీరో నాగశౌర్యనే ఇటీవల ‘రంగబలి’ సినిమా ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. దీంతో ఈ విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతూ రష్మికపై పంచ్‌లు పేలుస్తున్నారు. అయితేనేం.. శ్రీలీల ఇప్పటికే టాలీవుడ్‌లో రష్మికకు చెక్ పెట్టిందని.. అతి త్వరలోనే నేషనల్ క్రష్‌ని కూడా క్లాష్ ఇస్తుందనేలా శ్రీలీల ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
Kajal-Sreeleela Dance | బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్