I’m not gay | నేను ‘గే’ కాదు.. ర్యాగింగ్ భూతానికి డిగ్రీ విద్యార్థి బలి
I’m not gay | ర్యాగింగ్ ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను గే కాదు అని పలుమార్లు చెప్పినప్పటికీ సీనియర్లు వినిపించుకోకుండా జూనియర్‌ను వేధించారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బుధవారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని నదియాకు చెందిన 18 ఏండ్ల విద్యార్థి స్వప్నదూప్ కుందు జాదవ్‌పూర్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్టియర్‌లో చేరాడు. […]

I’m not gay |
ర్యాగింగ్ ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను గే కాదు అని పలుమార్లు చెప్పినప్పటికీ సీనియర్లు వినిపించుకోకుండా జూనియర్‌ను వేధించారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బుధవారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని నదియాకు చెందిన 18 ఏండ్ల విద్యార్థి స్వప్నదూప్ కుందు జాదవ్‌పూర్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్టియర్‌లో చేరాడు. అయితే అతన్ని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. నువ్వు గే అంటూ స్వప్నదూప్ను మానసికంగా వేధించారు.
తాను గే కాదు అని పలుమార్లు సీనియర్లకు స్వప్నదూప్ వివరణ కూడా ఇచ్చాడు. అవేమీ సీనియర్లు పట్టించుకోలేదు. అయితే బుధవారం రాత్రి తన హాస్టల్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి అనుమానాస్పదస్థితిలో కిందపడి చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వప్నదూప్ నగ్నంగా పడి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే బాధిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్వప్నదూప్ మృతి కేసులో సీనియర్ సౌరభ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. స్వప్న దూప్ను ర్యాగింగ్ చేసింది నిజమే అని చౌదరి అంగీకరించాడు. చౌదరి 2022లో ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేసినప్పటికీ, క్యాంపస్‌లో నాన్ బోర్డర్‌గా కొనసాగుతున్నాడు. చౌదరిపై 302/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.