హైదరాబాద్‌లో.. రూ. కోటి 25 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

హైదరాబాద్ నగరంలో గణేశ్ లడ్డూ భారీ ధర పలికింది. బండ్లగూడలోని కీర్తి రిమ్‌మండ్ విల్లాలో విఘ్నేశ్వరుడి లడ్డూను గురువారం ఉదయం వేలం వేశారు. వేలం పాటలో ఈ లడ్డూ ధర రూ. కోటి 25 లక్షలు పలికింది. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ధర పలకలేదని నిర్వాహకులు వెల్లడించారు.
వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తమ గేటెడ్ కమ్యూనిటీలో పని చేసే వర్కర్ల పిల్లల చదువులకు, వారి ఆరోగ్య అవసరాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అనాథ ఆశ్రమాలకు కిరాణ సరుకులు ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా కానివ్వమని, స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇక మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.