అంబేద్కర్‌ను కాల్చేస్తా.. అంటు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్‌ అరెస్ట్‌

విధాత:  రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన.. వాటిని యూట్యూబ్‌లో చేయడంతో వివాదాస్పదమైంది. ఈ విషయంపై పలు ఫిర్యాదులు అందగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అంబేద్కర్‌ రాసిన పుస్తకాలపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్‌పై యూట్యూబ్‌లో వీడియోలను విడతల వారీగా అప్‌లోడ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత, […]

  • By: krs    latest    Feb 10, 2023 12:59 PM IST
అంబేద్కర్‌ను కాల్చేస్తా.. అంటు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్‌ అరెస్ట్‌

విధాత: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన.. వాటిని యూట్యూబ్‌లో చేయడంతో వివాదాస్పదమైంది. ఈ విషయంపై పలు ఫిర్యాదులు అందగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

అంబేద్కర్‌ రాసిన పుస్తకాలపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్‌పై యూట్యూబ్‌లో వీడియోలను విడతల వారీగా అప్‌లోడ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత, అంబేద్కర్‌ సంఘాలు మండి పడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. హమారా ప్రసాద్ వీడియోను బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పలువురు హమారా ప్రసాద్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అల్వాల్‌ అదుపులోకి అరెస్టు చేసి, మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.