మిర్యాలగూడలో అత్యాధునిక హంగులతో నూతన స్కిన్ హాస్పిటల్ ప్రారంభం
విధాత, మిర్యాలగూడ: శీతాకాలంలో చర్మవ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని స్కిన్ ప్రత్యేక వైద్య నిపుణురాలు తేజస్వి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డాక్టర్స్ కాలనీలో గాంధీ స్కిన్ హాస్పిటల్‌ను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్ గని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడలో ఆధునిక పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించేందుకు ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చర్మవ్యాధులతో పాటు, చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన […]

విధాత, మిర్యాలగూడ: శీతాకాలంలో చర్మవ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని స్కిన్ ప్రత్యేక వైద్య నిపుణురాలు తేజస్వి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డాక్టర్స్ కాలనీలో గాంధీ స్కిన్ హాస్పిటల్‌ను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్ గని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడలో ఆధునిక పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించేందుకు ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చర్మవ్యాధులతో పాటు, చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక వైద్య నిపుణులు చికిత్స అందించనున్నారని వారు తెలిపారు.
కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పాశం నరసింహారెడ్డి ఆసుపత్రి ఎండి చిలువేరు మారుతి, ఐఎంఏ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, గ్రామీణ వైద్యుల అసోసియేషన్, మని, రఘు, సాయి శ్రీనివాస్, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.