ఉప్పల్‌ భారత్-ఆసీస్ మ్యాచ్: టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. ఫ్యాన్స్ ఆందోళన(Video)

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల జారీలో జాప్యం ఉప్పల్ స్టేడియం వ‌ద్ద‌ ఫ్యాన్స్ ఆందోళ‌న‌ విధాత‌: ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్ల జారీలో జ‌రుగుతున్న ఆల‌స్యంపై ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ధ‌ర్నా చేశారు. టికెట్ల కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్‌ ఉదయం నుంచే జింఖానా మైదానం వ‌ద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధ‌వారం […]

ఉప్పల్‌ భారత్-ఆసీస్ మ్యాచ్: టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. ఫ్యాన్స్ ఆందోళన(Video)
  • భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల జారీలో జాప్యం
  • ఉప్పల్ స్టేడియం వ‌ద్ద‌ ఫ్యాన్స్ ఆందోళ‌న‌

విధాత‌: ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్ల జారీలో జ‌రుగుతున్న ఆల‌స్యంపై ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ధ‌ర్నా చేశారు.

టికెట్ల కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్‌ ఉదయం నుంచే జింఖానా మైదానం వ‌ద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం దాటినా కూడా టికెట్లు అమ్మేందుకు కౌంట‌ర్లు తెర‌వ‌క‌ పోవ‌డంతో ఇరిటేడ్ అవుతున్నారు. బ్లాక్‌లో టికెట్ల‌ను అమ్మేందుకే ఇలా జాప్యం జ‌రుగుతోంద‌ని మండి ప‌డుతున్నారు.

చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నామని.. టికెట్లు మాత్రం ఇవ్వట్లేదని స్టేడియం బయట నిరసనకు దిగారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లను హెచ్‌సీఏ బ్లాక్‌లో విక్రయిస్తున్న‌ద‌ని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ నగదును రిఫండ్ చేస్తున్నారని చెప్పారు. 33వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భారీగా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.