IND VS SA: రాణించిన KL రాహుల్, సూర్య కుమార్ భారత్ శుభారంభం

విధాత: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ 20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ మెరిసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్ల లో చేదించింది. రోహిత్ శర్మ, కోహ్లీలు త్వరగా ఔట్ అయినప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ల బ్యాటింగ్ ధాటికి సఫారీ జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో భారత్‌కు శుభారంభాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా […]

  • By: krs    latest    Sep 28, 2022 5:27 PM IST
IND VS SA: రాణించిన KL రాహుల్, సూర్య కుమార్ భారత్ శుభారంభం

విధాత: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ 20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ మెరిసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్ల లో చేదించింది.

రోహిత్ శర్మ, కోహ్లీలు త్వరగా ఔట్ అయినప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ల బ్యాటింగ్ ధాటికి సఫారీ జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో భారత్‌కు శుభారంభాన్ని అందించారు.

మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత బౌలర్లు అర్షదీప్ 3, చాహర్ 2, హర్షల్ 2, అక్షర్ పటేల్ 1 లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి సఫారీ జట్టును కట్టడి చేశారు.