టీమ్ ఇండియాకు అగ్ని పరీక్ష! సిరీస్ పడుతారా.. చేజార్చుంటారా?
కివీస్.. టీమ్ ఇండియా మధ్య ఆఖరి టీ20లోనూ టఫ్ ఫైట్ అహ్మదాబాద్ వేదికగా చివరి టీ20 మ్యాచ్.. షా ఇన్ ఆర్ గిల్ కంటిన్యూ! సిరీస్ డిసైడర్ లాస్ట్ టీ20 టీమ్ కాంబినేషన్లో బిగ్ ట్విస్ట్ స్టార్ స్పోర్ట్స్ లో రేపు సాయంత్రం 6.30 గం.ల నుంచి విధాత: ఒకవైపు 2012 నుంచి సొంతగడ్డపై పరాజయం ఎరుగని టీమ్ ఇండియా 2017, 2019లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై తప్ప ఓటమి ఎరుగని భారత జట్టు.. మరోవైపు భారత్లో ద్వైపాక్షిక […]

- కివీస్.. టీమ్ ఇండియా మధ్య ఆఖరి టీ20లోనూ టఫ్ ఫైట్
- అహ్మదాబాద్ వేదికగా చివరి టీ20 మ్యాచ్..
- షా ఇన్ ఆర్ గిల్ కంటిన్యూ!
- సిరీస్ డిసైడర్ లాస్ట్ టీ20 టీమ్ కాంబినేషన్లో బిగ్ ట్విస్ట్
- స్టార్ స్పోర్ట్స్ లో రేపు సాయంత్రం 6.30 గం.ల నుంచి
విధాత: ఒకవైపు 2012 నుంచి సొంతగడ్డపై పరాజయం ఎరుగని టీమ్ ఇండియా 2017, 2019లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై తప్ప ఓటమి ఎరుగని భారత జట్టు.. మరోవైపు భారత్లో ద్వైపాక్షిక సిరీస్లో ఒక్కసారి విజయం సాధించని కివీస్ జట్టు.. సిరీస్ డిసైడర్లో టఫ్ ఫైట్లో తలపడనున్నాయి. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో చెరో విజయం సాధించిన రెండు జట్లు తమ రికార్డును మెరుగుపరుచుకోవాలని తహతహలాడుతున్నాయి.
దీంతో అహ్మదాబాద్ టీ20 మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. రాంచీలో కివీస్ గెలవగా.. లక్నోలో భారత్ విజయాన్నందుకుంది.. దీంతో అహ్మదాబాద్లో జరిగే టీ20 లో విజయం రెండు జట్లకూ కీలకంగా మారింది.. ఎందుకంటే వరుస సిరీస్ విజయాల రికార్డు కాపాడుకోవాలని టీం ఇండియా పట్టుదలగాఉండగా..ఎప్పుడూ భారత గడ్డపై దక్కని అరుదైన సిరీస్ విజయాన్నందించి చరిత్ర సృష్టించాలని మిచెల్ సాంట్నర్ ఆశిస్తున్నాడు.
హార్డ్ హిట్టర్లతో జట్లు కళకళ
నిజానికి రెండు జట్లలోనూ భారీ హిట్టర్లున్నారు. టీమ్ ఇండియాలో ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక పాండ్యా లాంటి హార్డ్ హిట్లర్లుండగా.. జట్టులో ఇప్పటివరకు చోటు దక్కించుకోలేకపోతున్న పృథ్వీ షా కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగలడు.. కివీస్ జట్టులో ఓపెనర్ ఫిన్ అలెన్, బ్రేస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ లాంటి హిట్లర్లున్నారు. డెవాన్ కాన్వే లాంటి నిలకడైన సూపర్ బ్యాట్స్ మెన్ ఉన్నాడు. ఎలాంటి వికెట్ పైనా.. పేస్ స్పిన్ ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కొనే అతికొద్ది మంది క్రికెటర్లలో అతను ఒకడు.
అంతేకాదు జట్టుకు అతను ప్రధాన కీపర్. వీళ్లే కాదు.. కివీస్ జట్టులో చాలామంది మల్లీటాలెంటెడ్ క్రికెటర్లున్నారు. జట్టులో బ్రేస్ వెల్ , గ్లెన్ ఫిలిప్ప్ లాంటి ఆటగాళ్లు బౌలింగ్ తోపాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలరు.. మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ ఎబిలిటీస్ తో అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో అలనాటి కివీస్ దిగ్గజం వెటోరిని తలపిస్తున్నాడు. రెండు టీ20ల్లో 3.87 ఎకానమీతో 2 వికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్ గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
కానీ కివీస్ జట్టులో ప్రధానంగా లోపించింది నిలకడ.. అందరూ వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో ఔటవుతున్నారు. కేన్ విలియమ్సన్ జట్టులో ఉంటే మిడిల్ లో నిలకడ పెరిగి హార్ధిక్ సేనకు పరాజయం దక్కేదేమో . అనుభవం లేని కివీస్ బ్యాట్స్ మెన్ కు ఎంత టాలెంట్ ఉన్నా తొందరపాటుతో ఆడి వికెట్లు సమర్పించుకోవడంతో విజయాలు దక్కడం లేదు. భీకర ఫాంలో ఉన్న కివీస్ క్రికెటర్లకు అహ్మదాబాద్ పిచ్ పై చెలరేగితే సిరీస్ విజయంతో పాటు తొలిసారిగా భారత్ లో ద్వైపాక్షిక సిరీస్ విజయం దక్కనుంది.
కివీస్ బౌలింగ్ లో చాలా డెప్త్ ఉంది.. ఫెర్గూసన్ అనుభవానికి తోడు కొత్త బౌలర్ల డఫీ తోపాటు సాంట్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇష్ సోధీ కూడా స్పిన్ లో రాణిస్తే కివీస్ బలం మరింత పెరగనుంది.
బౌలింగ్ లో కట్టడి చేస్తేనే.. భారత బౌలింగ్ కాంబినేషన్ పై జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాస్తా గందరగోళంగా కనిపిస్తున్నారు.
లక్నో పిచ్ స్పిన్నర్లకు అనూహ్యంగా సహకరిస్తున్న సమయంలో జట్టు ప్రధాన స్పిన్నర్ చహాల్ కు కేవలం రెండు ఓవర్లే ఇవ్వడం… అందునా రెండు ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్ల తీసిన భారత ప్రధాన స్పిన్నర్ కు మళ్లీ బౌలింగ్ ఇవ్వకపోవడం స్వయానా హార్దిక పాండ్యా పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయడం .. పార్ట్ టైమ్ స్పిన్నర్ తోనూ పూర్తి కోటా బౌలింగ్ చేయడం కెప్టెన్ గా హార్దిక్ నిర్ణయాలను ప్రశ్నించేలా ఉన్నాయి. జట్టు పేసర్లు అర్షదీప్ సింగ్, శివం మావిలలో నిలకడ లోపించినట్లుగా స్పష్టంగా తెలుస్తున్నది.. ఎప్పుడు వికెట్లు తీస్తారో..? ఎప్పుడు భారీగా పరుగులు సమర్పించుకుంటారో తెలియనట్లుగా ఉంది..
మరోవైపు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో వేరియేషన్స్ లేకపోవడంతో అతని బౌలింగ్ ప్రత్యర్థులకు ప్రెడిక్టబుల్ .. దీంతో పరుగులు నియంత్రించలేడు.. కాగా చైనామెన్ కుల్దీప్ మాత్రమే నిలకడగా రాణిస్తుండగా.. ఎక్కువగా బ్యాటింగ్ లో సూర్యకుమార్ చెలరేగడంతోనూ వరుసగా విజయాలు సాధిస్తున్న పరిస్థితి. చివరి టీ20లో జట్టు కాంబినేషన్ ను ఎలా చేస్తారో..? ఈ ఫార్మాట్ కు సూట్ కాని గిల్ లేదంటే వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ లేదంటే త్రిపాఠి స్థానంలో పృథ్వీ షాకు చోటు కల్పిస్తారా..? ప్రశ్నగా ఉంది.
స్పిన్ అవసరం లేదనుకుంటే చహాల్ బదులు మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్లు నిలకడగా రాణిస్తే మిడిల్లో సూర్య.. చివరలో హార్దిక్ పాండ్యా రెచ్చి పోయే అవకాశం ఉంది. మరోవైపు దీపక్ హుడా కూడా అంతగా రాణించకున్నా.. ఆల్ రౌండర్ పాత్రలో వాషింగ్టన్ సుందర్ సూపర్బ్ అనిపిస్తున్నాడు.
పిచ్ వాతావరణం..
అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్ కాస్త బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నా బౌలింగ్ కూ అనుకూలించే మంచి ఫ్రెండ్లీ పిచ్.. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్ లలో యావరేజి స్కోరు దాదాపు 169 గా ఉంది. మంచు ప్రభావం ఉన్నా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువే. టాస్ కీలకం..
జట్లు అంచనా
భారత్: శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(కెప్టెన్),దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివంమావి,కుల్దీప్ యాదవ్,ఉమ్రాన్ మాలిక్,అర్షదీప్ సింగ్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్,డెవాన్ కాన్వే(వికెట్ కీపర్),మార్క్ చాప్ మన్,గ్లెన్ ఫిలిప్స్,డారిల్ మిచెల్,మైకేల్ బ్రేస్ వెల్,మిచెల్ సాంట్నర్(కెప్టెన్),ఇష్ సోధి,లోకీ ఫెర్గూసన్,జాకబ్ డఫీ, టిక్నర్.