Coronavirus | భారత్లో 24 గంటల్లో 4,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus | విధాత: భారత్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 4,435 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ 25 తర్వాత ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు( Corona Positive Cases )నమోదు కావడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 25న 4,777 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఇప్పుడు 4,435 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశ […]

Coronavirus |
విధాత: భారత్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 4,435 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గతేడాది సెప్టెంబర్ 25 తర్వాత ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు( Corona Positive Cases )నమోదు కావడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 25న 4,777 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఇప్పుడు 4,435 కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,091 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4.47 కోట్ల కొవిడ్ కేసులు నమోదు కాగా, 5,30,916 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 15 మంది మృతి చెందారు.
మహారాష్ట్ర, కేరళలో నలుగురు చొప్పున, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్థాన్ నుంచి ఒక్కొక్కరి చొప్పున మరణించారు.