India: భార‌త్‌కి తీర‌ని అన్యాయం చేసిన ఐసీసీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఏకంగా 8,400 కి.మీ ప్ర‌యాణ‌మా?

India: మెగా స‌మ‌రం మ‌రి కొద్ది రోజులలో మొద‌లు కానుంది. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తి ఒక్క టీం కూడా త‌మ ప్రణాళిక‌లు ర‌చిస్తుంది. అయితే ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ స్వ‌దేశంలో జ‌ర‌గ‌డం ఇండియాకి క‌లిసొచ్చే అంశం. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ కోసం మొత్తం 10 వేదికలను బీసీసీఐ సెలెక్ట్ చేయ‌గా, కొన్ని స్టేడియాల్లో ప‌లు జ‌ట్లు రెండేసి మ్యాచులు ఆడుతున్నాయి. ఈ సారి టోర్నీ స్వ‌దేశంలో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఐసీసీ మాత్రం భార‌త్‌కి […]

  • By: sn    latest    Jul 02, 2023 6:29 AM IST
India: భార‌త్‌కి తీర‌ని అన్యాయం చేసిన ఐసీసీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఏకంగా 8,400 కి.మీ ప్ర‌యాణ‌మా?

India: మెగా స‌మ‌రం మ‌రి కొద్ది రోజులలో మొద‌లు కానుంది. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తి ఒక్క టీం కూడా త‌మ ప్రణాళిక‌లు ర‌చిస్తుంది. అయితే ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ స్వ‌దేశంలో జ‌ర‌గ‌డం ఇండియాకి క‌లిసొచ్చే అంశం. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ కోసం మొత్తం 10 వేదికలను బీసీసీఐ సెలెక్ట్ చేయ‌గా, కొన్ని స్టేడియాల్లో ప‌లు జ‌ట్లు రెండేసి మ్యాచులు ఆడుతున్నాయి. ఈ సారి టోర్నీ స్వ‌దేశంలో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఐసీసీ మాత్రం భార‌త్‌కి తీర‌ని అన్యాయం చేసింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు భార‌త‌ జట్టు ఆడబోయే 9 మ్యాచులను 9 వేర్వేరు వేదికల్లో నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే భార‌త జ‌ట్టు మాత్ర‌మే ఇన్ని స్టేడియాల మ‌ధ్య ప్ర‌యాణిస్తూ మ్యాచ్‌లు ఆడ‌నుంది. టీమిండియా ప్లేయర్లు లీగ్ మ్యాచ్‌ల కోసం ఏకంగా 8,400 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ప‌రిస్థితి ఉంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌చ్చితంగా న్యూజిలాండ్‌పై గెలావాల‌నే క‌సితో ఉన్న భార‌త్ ఆ మ్యాచ్ ముందు వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి రావ‌డం భార‌త క్రికెట్ అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. రెండు, మూడు రోజుల గ్యాప్​లో వేల కిలోమీటర్లు జర్నీ చేసేలా ఐసీసీ షెడ్యూల్ విడుద‌ల చేయ‌డంతో భారత క్రికెట్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కొన్ని జట్లు ఒకే న‌గ‌రంలో వారం రోజుల పాటు ఉండే అవ‌కాశం ఉంది. వారు హాయిగా విశ్రాంతి తీసుకొని పిచ్ ప‌రిస్థితి కూడా పూర్తి స్థాయిలో అర్ధం చేసుకొని అద్భుతంగా ఆడే అవ‌కాశం ఉంది. భార‌త్ విష‌యానికి వ‌స్తే ఒక్క హైదరాబాద్‌లో తప్ప మిగతా అన్ని వేదికల్లో టీమిండియా మ్యాచులు ఆడ‌నుంది. ఇక వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ని గువాహతి, త్రివేండ్రంలో ఆడ‌నుంది. ఇవి వరల్డ్ కప్ ప్రయాణాలకు అదనంగా మారాయి.. వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నీలో భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను చెన్నైలో ఆడ‌నుండ‌గా, .. అక్కడి నుంచి రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లాలి. దీనికోసం ఏకంగా 1761 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.. ఈ మ్యాచ్ పూర్త‌య్యాక‌ మళ్లీ పూణేలో బంగ్లాదేశ్‌తో ఆడి , అక్కడి నుంచి ధర్మశాలకు వెళ్లి అక్క‌డ‌ కివీస్‌తో టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల మ‌ధ్య గ్యాప్ కేవ‌లం రెండు రోజులే ఉండ‌నుండ‌డంతో భారత్ ఆటగాళ్లు చాలా అల‌సిపోతారని ఫ్యాన్స్ బాధ‌ప‌డుతున్నారు.