భారత విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు
అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏండ్ల భారత విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మర్డర్ కేసు నమోదైంది. తన నివాసంలో తాత, నాయినమ్మతోపాటు మామను కూడా కాల్చి చంపినట్టు స్థానిక పోలీసులు విద్యార్థిపై అభియోగాలు మోపారు

- అరెస్టు చేసిన అమెరికా పోలీసులు
- తాత, నాయినమ్మతోపాటు మామను
- ఇంట్లోనే కాల్చి చంపినట్టు అభియోగం
విధాత: అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏండ్ల భారత విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మర్డర్ కేసు నమోదైంది. తన నివాసంలో తాత, నాయినమ్మతోపాటు మామను కూడా కాల్చి చంపినట్టు స్థానిక పోలీసులు విద్యార్థిపై అభియోగాలు మోపారు. మంగళవారం అతడిని అరెస్టు చేశారు. హత్య కేసులను లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ కొప్పోలా డ్రైవ్‌లోని కొప్పోలా రోడ్‌లో ఉన్న తన ఇంట్లో సోమవారం ఉదయం 9 గంటలకు దిలీప్‌కుమార్ బ్రహ్మభట్, (72), బిందు బ్రహ్మభట్ (72), యష్‌కుమార్ బ్రహ్మభట్, (38), ను ఓం బ్రహ్మ్‌భట్ కా్ల్చి చంపారని పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు పేర్కొన్నారు.