Tumour | మహిళ కడుపులో 15 కిలోల కణితి.. 12 మంది డాక్టర్లు కలిసి సర్జరీ
Tumour | ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. కొద్ది దూరం నడుద్దామంటే ఆయాసంతో బాధపడేది. తిండి కూడా సరిగా తినలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం, కడుపునొప్పి తీవ్రం కావడంతో చివరకు వైద్యులను సంప్రదించగా, ఆమె శరీరంలో ఉన్న భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితిని తొలగించేందుకు 12 మంది డాక్టర్లు కష్టపడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 41 ఏండ్ల మహిళ గత కొంతకాలం నుంచి తీవ్రంగా బాధపడుతోంది. […]

Tumour | ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. కొద్ది దూరం నడుద్దామంటే ఆయాసంతో బాధపడేది. తిండి కూడా సరిగా తినలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం, కడుపునొప్పి తీవ్రం కావడంతో చివరకు వైద్యులను సంప్రదించగా, ఆమె శరీరంలో ఉన్న భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితిని తొలగించేందుకు 12 మంది డాక్టర్లు కష్టపడాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 41 ఏండ్ల మహిళ గత కొంతకాలం నుంచి తీవ్రంగా బాధపడుతోంది. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగిన నొప్పికి కారణాలు తెలుసుకోలేకపోయారు. చివరకు ఇండోర్‌లోని ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఆమెకు స్కానింగ్‌లో నిర్వహించగా, కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో 12 మంది డాక్టర్లు.. రెండు గంటలకు పైగా సర్జరీ నిర్వహించి, కణితిని విజయవంతంగా తొలగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అతుల్ వ్యాస్ మాట్లాడుతూ.. బాధిత మహిళ బరువు 49 కేజీలు కాగా, కణితి బరువు 15 కిలోలుగా ఉన్నట్లు తెలిపారు. కణితి తొలగించిన తర్వాత ఆమె బరువు 34 కిలోలకు తగ్గిందన్నారు. కణితి కారణంగా ఆమె నడుస్తున్నప్పుడు, తింటున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఆ కణతి వల్ల కడుపులో వాపు వచ్చిందని, అయితే అది పగలలేదని, లేదంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఉండేదన్నారు. కడుపులో కణతిని ఓవేరియన్ ట్యూమర్‌గా ఇండెక్స్ డాక్టర్లు గుర్తించారు.