Lb Nagar: బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజ తగిలి చిన్నారికి, తండ్రికి తీవ్ర గాయాలు
విధాత: సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. వాటిని గాల్లో ఎగురవేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. గాల్లో తేలియాడుతూ పతంగులు తెగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి గాలిపటాలు అన్ని స్తంభాలకు, చెట్లపై పడిపోతుంటాయి. ఇక గాలి పటాలను ఎగురేసేందుకు ఉపయోగించే మాంజ కూడా రహదారులకు అడ్డంగా గాల్లో తేలియాడుతుంటుంది. అలా ఆ మాంజాల వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ బ్రిడ్జిపై చైనా మాంజ తగిలి ఓ ఆరేండ్ల చిన్నారి […]

విధాత: సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. వాటిని గాల్లో ఎగురవేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. గాల్లో తేలియాడుతూ పతంగులు తెగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి గాలిపటాలు అన్ని స్తంభాలకు, చెట్లపై పడిపోతుంటాయి. ఇక గాలి పటాలను ఎగురేసేందుకు ఉపయోగించే మాంజ కూడా రహదారులకు అడ్డంగా గాల్లో తేలియాడుతుంటుంది. అలా ఆ మాంజాల వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
తాజాగా ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ బ్రిడ్జిపై చైనా మాంజ తగిలి ఓ ఆరేండ్ల చిన్నారి గొంతుకు తీవ్ర గాయమైంది. వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన వినయ్ కుమార్ తన బిడ్డతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఆ మాంజ చిన్నారి గొంతుకు తగిలింది. దీంతో ఆమెకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. పాప తీవ్రంగా బాధ పడుతుండటంతో చింతల్‌కుంటలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.