కూల్ డ్రింక్ బాటిల్‌లో పురుగుల మందు.. తాగిన చిన్నారి మృతి
విధాత: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ బాటిల్‌లో భద్ర పరిచిన పురుగుల మందును ఓ ఆరేండ్ల చిన్నారి తాగేసింది. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆసిఫాబాద్ మండల పరిధిలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్విక(6) అనే కూతురు ఉంది. అయితే తన పత్తి చేనుకు పురుగుల మందు కొట్టగా, మిగిలిన దాన్ని ఓ కూల్ డ్రింక్ బాటిల్‌లో రాజేశ్ దాచి పెట్టాడు. ఆ బాటిల్‌ను […]

విధాత: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ బాటిల్‌లో భద్ర పరిచిన పురుగుల మందును ఓ ఆరేండ్ల చిన్నారి తాగేసింది. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.
ఆసిఫాబాద్ మండల పరిధిలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్విక(6) అనే కూతురు ఉంది. అయితే తన పత్తి చేనుకు పురుగుల మందు కొట్టగా, మిగిలిన దాన్ని ఓ కూల్ డ్రింక్ బాటిల్‌లో రాజేశ్ దాచి పెట్టాడు. ఆ బాటిల్‌ను ఇవాళ ఉదయం శాన్విక తీసుకొని ఆడుకుంది.
అది కూల్ డ్రింక్ బాటిల్ కావడంతో.. కూల్ డ్రింక్ అని భావించి శాన్విక తాగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను రాజేశ్, లావణ్య ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శాన్విక తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.