ట్యాంకు బండ్పై ‘వెదిరే.. రావి’ విగ్రహాలు ప్రతిష్టించండి: మంత్రి జగదీష్ రెడ్డికి వారసుల విజ్ఞప్తి
విధాత: ఆచార్య వినోభా బావే స్పూర్తితో భూదానోద్యమంలో పాల్గొని వందలాది ఎకరాల భూమిని పేదలకు దారాదత్తం చేసిన వేదిరే రామచంద్రా రెడ్డి, తెలంగాణా సాయుధ రైతాంగా పోరాట యోధులు, నల్లగొండ మొట్టమొదటి లోక్ సభ సభ్యుడు రావి నారాయణ రెడ్డి విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించాలని వారి వారసులు మంగళవారం మంత్రి జగదీష్ రెడ్డికి వినతి పత్రం అంద జేశారు. శ్రీ భూదాన్ రామచంద్రా రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు వేదిరే వినయ్ చంద్రారెడ్డి, డాక్టర్ […]

విధాత: ఆచార్య వినోభా బావే స్పూర్తితో భూదానోద్యమంలో పాల్గొని వందలాది ఎకరాల భూమిని పేదలకు దారాదత్తం చేసిన వేదిరే రామచంద్రా రెడ్డి, తెలంగాణా సాయుధ రైతాంగా పోరాట యోధులు, నల్లగొండ మొట్టమొదటి లోక్ సభ సభ్యుడు రావి నారాయణ రెడ్డి విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించాలని వారి వారసులు మంగళవారం మంత్రి జగదీష్ రెడ్డికి వినతి పత్రం అంద జేశారు.
శ్రీ భూదాన్ రామచంద్రా రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు వేదిరే వినయ్ చంద్రారెడ్డి, డాక్టర్ వెదిరే ప్రభోద్ చంద్రారెడ్డిలతో పాటు స్వతంత్ర సమరయోధులు రావి నారాయణ రెడ్డి మనుమరాలు రావి ప్రతిభలు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు.
మహాత్మాగాంధీ మార్గదర్శనంలో ఆచార్య వినోభా బావే 1951 ఏప్రిల్ 18 న భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో పాల్గొని తనకున్న భూమిని పేదలకు ధారాదత్తం చేసిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణా సాయుధ పోరాటానికి అధ్యక్షత వహించిన రావి నారాయణ రెడ్డి 1952 తొలి ఎన్నికల్లో నల్గొండ లోకసభ నుంచి బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారని వారు గుర్తు చేశారు. అంతే గాకుండా ఆ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలుపొందారున్నారు.
అటువంటి యోధుల స్మారకార్థం వారి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద నెల కొల్పడం ద్వారా వర్తమాన, భవిష్యత్ తరాలకు భూదాన్ ఉద్యమం ప్రాశస్త్యం తో పాటు తెలంగాణా సాయుధ పోరాటం స్ఫూర్తిని అందించిన వారమౌతామని మంత్రి జగదీష్ రెడ్డికి అందించిన వినతి పత్రం లో ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు.