బీమా డబ్బుల కోసం డ్రైవర్‌ను హత్య చేసిన సెక్రటేరియట్ ఉద్యోగి
సంఘటన స్థలంలో పెట్రోల్ డబ్బా కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు అప్పులు చేసి బెట్టింగ్ అడిన ధర్మా మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న పోలీస్‌లు విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఈనెల 9న జరిగిన కారులో సజీవ దహనం కేసులో బీమా డబ్బుల కోసం డ్రైవర్‌ను హత్యచేసి సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాటకమాడారు. పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన పెట్రోల్ డబ్బా ఆధారంగా […]

- సంఘటన స్థలంలో పెట్రోల్ డబ్బా
- కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు
- అప్పులు చేసి బెట్టింగ్ అడిన ధర్మా
- మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న పోలీస్‌లు
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఈనెల 9న జరిగిన కారులో సజీవ దహనం కేసులో బీమా డబ్బుల కోసం డ్రైవర్‌ను హత్యచేసి సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాటకమాడారు.
పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన పెట్రోల్ డబ్బా ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈకేసులో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మరికాసేపట్లో పోలీస్‌లు ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీడియా ముందు వెల్లడించనున్నారు.
టేక్మాల్ మండలం వెంకటాపురం సమీపంలో ఈ నెల9న జరిగిన కారు సజీవ దహనం వ్యక్తి హత్య కేసులో పలు కీలక విషయాలను పోలీసులు బయట పెట్టనున్నారు సమీప గిరిజన తండాకు చెందిన ధర్మానాయక్ సెక్రెటరీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఆయన ఇటీవల బెట్టింగ్ చేసి అప్పుల పాలు కావడంతో ఆయనలో దురాశ పెరిగిపోయింది. కార్ డ్రైవర్ ని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులు క్లీన్ చేయించుకోవడానికి ధర్మ నాటకామాడినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఈ కేసును సవాల్‌గా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందంచే దర్యాప్తు చేయించడంతో అనేక కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం.