Nizamabad: BJPలో అంతర్గత పోరు.. రెండు వర్గాలుగా జిల్లా నాయకులు

ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మినర్సయ్య మధ్య గ్యాప్ బస్వతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఎంపీ అరవింద్ విధాత‌, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, ఎంపీ అరవింద్ మధ్య పొసగటం లేదన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న ప్రశ్నకు అరవింద్ ఇచ్చిన సమాధానం కూడా జిల్లాలో వర్గపోరు ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. పార్టీలో గ్రూప్ […]

Nizamabad: BJPలో అంతర్గత పోరు.. రెండు వర్గాలుగా జిల్లా నాయకులు
  • ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మినర్సయ్య మధ్య గ్యాప్
  • బస్వతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఎంపీ అరవింద్

విధాత‌, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, ఎంపీ అరవింద్ మధ్య పొసగటం లేదన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న ప్రశ్నకు అరవింద్ ఇచ్చిన సమాధానం కూడా జిల్లాలో వర్గపోరు ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంత ఉంటే అంత ఎంజాయ్ చేయోచ్చని ఆయనే అంటున్నారు.

తారాస్థాయికి వర్గ పోరు

బీజేపీ జిల్లా పార్టీలో అరవింద్ ఎంట్రీ నుంచి వర్గ పోరు తారాస్థాయికి చేరిందని ఆ పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జిల్లా బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎంపీ అరవింద్‌ రెండు వర్గాలుగా మారార‌నేది కమలం పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య అందరినీ కలుపుకొని పోతున్నారని ఇది అరవింద్‌కు ఏ మాత్రం నచ్చటం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విబేధాలు లేవని చెప్ప‌ని అరవింద్

యెండల వర్గాన్ని బస్వ లక్ష్మీనర్సయ్య ప్రోత్సహిస్తున్నారని అదే వీరి మధ్య గ్యాప్‌కు కారణం అని జిల్లా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడికి మీకు పొసగటం లేదన్న ప్రశ్నకు అరవింద్ బలం చేకూర్చేలా జిల్లా పార్టీ అధ్యక్షుడి వయస్సుకు నా వయస్సుకు 20 ఏళ్లు గ్యాప్ అదే గ్యాప్ అంటూ చమత్కరించారు. కానీ పార్టీలో అలాంటి విభేదాలేమీ లేవని చెప్పలేదు. పార్టీలో చాలా మంది వస్తుంటారు నాయకుడనేవాడికి బుద్ధి బలం, స్టామినా, పనిచేసే సత్తా ఉండాలని చెప్పుకొచ్చారు కానీ విబేధాలు లేవన్న మాటను ఎక్కడా చెప్పలేదు ఎంపీ అరవింద్.

బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ

అరవింద్ పార్టీలో జాయిన్ అయిన మొదట్నుంచి అరవింద్ ఎంపీగా గెలిచేవరకు బస్వ లక్ష్మీనర్సయ్య.. అరవింద్‌తో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరికీ అస్సలు పడటం లేదన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. యెండల వర్గం, అరవింద్ వర్గం అంటూ ఇప్పటికే జిల్లా పార్టీలో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బస్వతో కూడా అరవింద్‌కు పోసగకపోవటంపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటేనే బాగుండు అన్న అరవింద్ వ్యాఖ్యలు చూస్తుంటే… బస్వకు అరవింద్‌కు గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అన్న భావసకు వస్తున్నారు విశ్లేషకులు. అరవింద్ ఎక్కడ కూడా ఈ గ్రూప్ రాజకీయాలను కొట్టిపారేయకపోవటం ప్రజల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తులే నాయకులు అంటూ చేసిన వాఖ్యలపై జిల్లా కమలం పార్టీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోందని ప‌లువురు భావిస్తున్నారు.