నాన్ SCSలకు ఇంటర్వ్యూ తేదీలు ఖరారు.. ఎవరికి దక్కునో IAS పదవులు..?
విధాత: నాన్ ఎస్‌సీఎస్ (స్టేట్ సివిల్ సర్వీసెస్) అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ ఖరారు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి 25 మంది అధికారులను జనవరి 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు చేయనుంది. ఈ ఇంటర్వ్యూ బోర్డులో ముగ్గురు ఆఫీసర్లు ఉంటే.. అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి ఉంటారు. కాబట్టి ప్రభుత్వ ఆశీస్సులు […]

విధాత: నాన్ ఎస్‌సీఎస్ (స్టేట్ సివిల్ సర్వీసెస్) అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ ఖరారు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి 25 మంది అధికారులను జనవరి 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు చేయనుంది.
ఈ ఇంటర్వ్యూ బోర్డులో ముగ్గురు ఆఫీసర్లు ఉంటే.. అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి ఉంటారు. కాబట్టి ప్రభుత్వ ఆశీస్సులు ఉన్న వారికే ఐఏఎస్‌లు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఐఏఎస్ అయ్యేవారిలో నర్సింహారెడ్డి, అశోక్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి ఉంటారని సమాచారం.
25 మంది ఆఫీసర్లు వీరే..
వీ శ్రీనివాసులు
ఎస్ సురేశ్
కే హరిత
డీ శ్రీనివాస్ నాయక్
ఎన్ యాదగిరి రావు
కే చంద్రశేఖర్ రెడ్డి
ఈవీ నర్సింహారెడ్డి
కే అశోక్ రెడ్డి
వీ సైదా
పీ మహేందర్
డీ ప్రశాంత్ కుమార్
టీ వెంకన్న
ఈ నవీన్ నికోలస్
వీ సర్వేశ్వర్ రెడ్డి
వీ శ్రీనివాస రెడ్డి
పీ కాత్యాయాని దేవీ
పీ వెంకటేశం
ఆర్ లక్ష్మణ్ చందు
ఏ పుల్లయ్య
ఆర్ ఏడుకొండలు
డీ హన్మంత్
సీ చంద్రకాంత్ రెడ్డి
వీ పాపయ్య
జీవీ నారాయణ రావు
ఎం పద్మజా