Rashmika Mandanna | ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న నేషనల్‌ క్రష్‌ శ్రీవల్లి

Rashmika Mandanna | ఐపీఎల్‌ 16వ సీజన్‌ నేటి నుంచి మొదలుకానున్నది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగనున్నది. అంతకు ముందు ప్రారంభ వేడుకలను అట్టహాసంగా బీసీసీఐ నిర్వహించనున్నది. తొలి మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుండగా.. అంతకు ముందు సాయంత్రం 6 గంటలకే ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వనున్నారు. మెగా ఈవెంట్‌లో పుష్పతో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్నా సైతం ప్రారంభోత్సవ […]

Rashmika Mandanna | ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న నేషనల్‌ క్రష్‌ శ్రీవల్లి

Rashmika Mandanna | ఐపీఎల్‌ 16వ సీజన్‌ నేటి నుంచి మొదలుకానున్నది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగనున్నది. అంతకు ముందు ప్రారంభ వేడుకలను అట్టహాసంగా బీసీసీఐ నిర్వహించనున్నది.

తొలి మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుండగా.. అంతకు ముందు సాయంత్రం 6 గంటలకే ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

వేడుకల్లో పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వనున్నారు. మెగా ఈవెంట్‌లో పుష్పతో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్నా సైతం ప్రారంభోత్సవ వేడుకల్లో ఫెర్ఫామెన్స్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ధ్రువీకరించింది.