Iran | ఇరాన్‌లో మరో ముగ్గురికి ఉరి.. పెల్లుబుకిన నిరసనలు
విధాత: ఉరిశిక్షలు అమలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుసున్న ఇరాన్ (Iran).. శుక్రవారం ముగ్గురు పురుషులకు ఉరిశిక్షను అమలుచేసింది. గత ఏడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా ముగ్గురు భద్రతా సిబ్బంది మరణానికి వీరు కారణమయ్యారని పేర్కొంది. ఈ ఉరిశిక్షలపై మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది. నిందితుల ట్రయల్ విచారణ అంతా బూటకమని, చిత్రహింసలు పెట్టి వారు నేరం ఒప్పుకొనేలా చేశారని ఆరోపించింది. కుర్దిష్ మైనారిటీ తెగకు చెందిన మాషా అమీనీ మృతిపై […]

విధాత: ఉరిశిక్షలు అమలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుసున్న ఇరాన్ (Iran).. శుక్రవారం ముగ్గురు పురుషులకు ఉరిశిక్షను అమలుచేసింది. గత ఏడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా ముగ్గురు భద్రతా సిబ్బంది మరణానికి వీరు కారణమయ్యారని పేర్కొంది.
ఈ ఉరిశిక్షలపై మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది. నిందితుల ట్రయల్ విచారణ అంతా బూటకమని, చిత్రహింసలు పెట్టి వారు నేరం ఒప్పుకొనేలా చేశారని ఆరోపించింది. కుర్దిష్ మైనారిటీ తెగకు చెందిన మాషా అమీనీ మృతిపై గతేడాది ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఏడుగురిని ఉరితీసింది. తాజా ఘటనలో ఉరిశిక్ష పడిన నిందితులు తమను కాపాడాలని లేఖ రాయడం ప్రపంచాన్ని కదిలించింది. మనల్ని చంపనివ్వద్దు, మాకు మీ సాయం కావాలి అని వారు రాసినట్లు చెబుతున్న లేఖ బుధవారం బయటకు వచ్చింది.
ఈ ఘటన తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిందితులు ముగ్గురినీ ఉంచిన దాస్త్‌గర్డ్ జైలు ముందు నిరసనకారులు విజిల్స్‌తో హోరెత్తించారు. ఇరాన్ అమలు చేస్తున్న వరస ఉరిశిక్షలపై యూఎన్ హక్కుల సంఘం ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు.