Niharika and Chaitanya | నిహారిక, చైతన్య విడిపోయినట్లేనా? అందుకేనా ఇదంతా..
Niharika and Chaitanya విధాత: కష్టాలు పేదవాళ్లకు మాత్రమే వస్తాయనేది చాలామంది ఆలోచన. దానికి డబ్బులేకపోవడమే ముఖ్య కారణమని, డబ్బు ఉంటే అన్నీ చేతికందినట్టేనని, డబ్బుతో దేనినైనా సాధించి తెచ్చుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. నిజానికి డబ్బుతో కొనలేనివి ఈ సృష్టిలో చాలా ఉంటాయి. వాటిలో ఏది ఉన్నా తిరిగిరానిది, సంపాదించుకోలేనిది ముఖ్యంగా మనశ్శాంతి ఒకటి. ఇది డబ్బుతో కొనుక్కునేది కాదు. దొచుకునేదీ కాదు. ప్రశాంతమైన, తృప్తితో నిండిన జీవితాన్ని సంపాదించుకోవడానికి డబ్బు మాత్రమే మార్గం కాదు. అసలు […]

Niharika and Chaitanya
విధాత: కష్టాలు పేదవాళ్లకు మాత్రమే వస్తాయనేది చాలామంది ఆలోచన. దానికి డబ్బులేకపోవడమే ముఖ్య కారణమని, డబ్బు ఉంటే అన్నీ చేతికందినట్టేనని, డబ్బుతో దేనినైనా సాధించి తెచ్చుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. నిజానికి డబ్బుతో కొనలేనివి ఈ సృష్టిలో చాలా ఉంటాయి.
వాటిలో ఏది ఉన్నా తిరిగిరానిది, సంపాదించుకోలేనిది ముఖ్యంగా మనశ్శాంతి ఒకటి. ఇది డబ్బుతో కొనుక్కునేది కాదు. దొచుకునేదీ కాదు. ప్రశాంతమైన, తృప్తితో నిండిన జీవితాన్ని సంపాదించుకోవడానికి డబ్బు మాత్రమే మార్గం కాదు. అసలు విషయంలోకి వస్తే..
సినీ ప్రపంచంలో ఓ జంట పెళ్ళితో ఒకటవబోతున్నారు అనే వార్తకన్నా, ఓ జంట విడిపోబోతున్నారనే వార్తే మరీ వైరల్ అయి కూర్చుంటుంది. ఎక్కడలేని క్యూరియాసిటీతో ఆ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదీ పెద్ద ఫ్యామిలీల వార్తయితే దాని క్రేజ్ మామూలుగా ఉండదు.
ఈ మధ్య కాలంలో విడాకులు అనే మాటరాగానే మెగా ఫ్యామిలీని ముందు కూచోపెట్టి వరసగా మూడు జంటల పేర్లు చెప్పుకుని, వాళ్ళు ఎప్పుడు విడిపోతారా అని తెగ చర్చించేసుకుంటున్నారు. అందులో నాగబాబు కూతురు నిహారిక విషయం అయితే ఎటూ తేలకుండా ఉండటం సగం అర్థం అయ్యి.. అర్థం కానీ మలయాళం సినిమాలా ఉందనేది టాక్.
దీని పైన నాగబాబు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎలాంటి వివరణలు ఇవ్వకపోవడం కూడా వింతగానే అనిపించింది. ఇక నిహారిక అయితే నటనలోకి దిగి సత్తా చూపించాలనే ప్రయత్నాలు కూడా మొదలెట్టి.. హాట్ హాట్ ఫోజులతో అల్లాడిస్తోంది. ఆమె మళ్లీ నటించడానికి కారణం.. భర్తతో విడిపోవడమే అనేలా వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా జరిగిన అన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కార్యక్రమానికి కూడా నిహారిక ఒక్కత్తే వచ్చి కుటుంబంతో కలిపి ఫోటోలు దిగింది కానీ ఎక్కడా భర్త చైతన్య కనిపించిన దాఖలాలు లేకపోవడంతో.. ఎప్పటి నుంచో విడిపోయారనే వార్తలను పూర్తిగా కన్ఫామ్ చేసినట్లయిందని అంతా అనుకుంటున్నారు. దీనికి మరింత బలం చేకూర్చేలా.. ఆమె భర్త (విడాకులు తీసుకుని ఉంటే మాజీ భర్త) చేసిన పోస్ట్ మరింత క్లారిటీ ఇచ్చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ వేదిగా చైతన్య చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటో షేర్ చేస్తూ.. పదిరోజులు విపస్సనా యోగ చేయడం తన జీవితంలో సంతోషాన్ని, హాయినీ నింపిందని పోస్ట్ చేశాడు. అసలు చైతన్య అక్కడకు వెళ్లాల్సిన పనేం వచ్చింది.
నిహారికతో వేగలేకే.. ఇలా యోగా సెంటర్స్‌లో సంతోషం కోసం ప్రయత్నిస్తున్నాడని.. నిహారికతో తెగదెంపులు అయిపోవడం వల్లే.. ఇప్పుడలా హ్యాపీగా ఉన్నాననేలా పోస్ట్ చేశాడనేలా.. చైతన్య చేసిన పోస్ట్‌పై వార్తలు వైరల్ అవుతున్నాయి. మ్యాగ్జిమమ్ ఈ పోస్ట్‌లో వారిద్దరి మధ్య విడాకుల వరకు మ్యాటర్ వెళ్లిందనేది మాత్రం సుస్పష్టమవుతోంది.2020లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది.
రెండేళ్ళపాటు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఇద్దరిమధ్య ఏం పొరపొచ్చాలు వచ్చాయో కారణాలు తెలియకపోయినా.. ఇద్దరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టుకోవడం, ఇద్దరికీ సంబంధించిన అకౌంట్స్ తీసేయడం అనుమానాలు మొదలయ్యేలా చేశాయి. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా చైతన్య కనిపించక పోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడైతే ఓ క్లారిటీ వచ్చేసిందని ఫిక్సయిపోవచ్చు.