Rajamouli and Mahesh | ఈ కాంబినేషన్‌లో మూవీ ఇప్పుడప్పుడే కష్టమేనా? జాతకం ఏం చెబుతుందంటే?

Rajamouli and Mahesh | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఆయన సినిమాను తీసే తీరు, పాత్రల్ని మలిచే విధానం అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంతా నోర్లు వెళ్ళబెట్టిమరీ తెలుగు సినిమా సత్తా ఏమిటో చూసేలా చేశాడు రాజమౌళి. అలాంటి వాడికి ప్రస్తుతం మీ జాతకం బాగా లేదంటే ఆయన నమ్మకపోవచ్చు. కానీ పరిస్థితులు కూడా అలాగే కనిపించడంతో నమ్మకతప్పడం లేదు అంటున్నారు […]

  • By: krs    latest    Sep 11, 2023 2:32 PM IST
Rajamouli and Mahesh | ఈ కాంబినేషన్‌లో మూవీ ఇప్పుడప్పుడే కష్టమేనా? జాతకం ఏం చెబుతుందంటే?

Rajamouli and Mahesh |

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఆయన సినిమాను తీసే తీరు, పాత్రల్ని మలిచే విధానం అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంతా నోర్లు వెళ్ళబెట్టిమరీ తెలుగు సినిమా సత్తా ఏమిటో చూసేలా చేశాడు రాజమౌళి. అలాంటి వాడికి ప్రస్తుతం మీ జాతకం బాగా లేదంటే ఆయన నమ్మకపోవచ్చు. కానీ పరిస్థితులు కూడా అలాగే కనిపించడంతో నమ్మకతప్పడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. విషయంలోకి వెళితే..

రాజమౌళి ఓ సినిమా ప్రారంభించాడంటే అందులో విజయం గ్యారెంటీ, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు, ఆయన ఏం తీయబోతున్నాడా అని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన నెక్ట్ ప్రాజెక్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి సినిమా చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నాడు. ఈ మాటను తనే ఓ సందర్భంలో బయటపెట్టాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే అనేలా టాక్ నడస్తుంది.. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ.. ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో అనే విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.

దీనికి కారణం.. రాజమౌళి జాతకంలో శని మహా దశ నడుస్తుందని కాస్త జాగ్రత్తగా ఉండాలని ఓ జ్యోతిష్కుడు హెచ్చరించాడని అంటున్నారు. అయితే జాతకాల మీద నమ్మకంలేని రాజమౌళి దీనిని లైట్ తీసుకున్నా.. జరిగేది చూస్తుంటే మాత్రం ఇదే నిజమనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మరో సినిమా చేయడం లేదు.

అలాగే అటు మహేష్ చేస్తున్న ‘గుంటూరు కారం’ మరింతగా లేట్ అవుతూ వస్తుంది. ఈ సినిమా రోజుకో విధంగా మార్పులు సంతరించుకుంటూ ఆలస్యమవుతోన్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళికి ప్రస్తుతం శని మహా దశ నడుస్తుందని, టైం ఏం బాగాలేదని జ్యోతిష్కుడు చెప్పినట్టే.. మహేష్ సినిమా లేట్ అవుతూ వస్తుందని, కొన్నాళ్ళు కొత్త ప్రాజెక్టులు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదనేలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెబుతున్నారట. దీంతో మహేష్‌తో చేసే సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ నడుస్తోంది. చూద్దాం.. ఈ వార్తలపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతాడో..