పొత్తు లేనట్టేనా? బీజేపీ నేతలు TDP బాట అందుకేనా!

విధాత: BJP నాయకులకు భవిష్యత్ కనిపిస్తోందా.. తమకు ఇక ఈ పార్టీలో రాజకీయ భవిష్యత్ లేదనే సంకేతం వినిపిస్తోందా.. అందుకే ఇక కొత్తదారులు వెతుక్కుంటున్నారా.. కొత్తది అంటే కొత్తది అని కాదు.. పాత దారే చూసుకుంటున్నారా. ప్రస్తుత BJP నాయకులు అడుగులు చూస్తుంటే అలగే అనిపిస్తోంది. కనిపిస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టిన BJPకి మంచి మేలు చేకూరింది. కంభంపాటి హరిబాబు లాంటివారు విశాఖ నించి ఎంపిలుగా గెలవగా తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన మాణిక్యాలరావు, కైకలూరు […]

  • By: krs    latest    Feb 26, 2023 1:20 PM IST
పొత్తు లేనట్టేనా? బీజేపీ నేతలు TDP బాట అందుకేనా!

విధాత: BJP నాయకులకు భవిష్యత్ కనిపిస్తోందా.. తమకు ఇక ఈ పార్టీలో రాజకీయ భవిష్యత్ లేదనే సంకేతం వినిపిస్తోందా.. అందుకే ఇక కొత్తదారులు వెతుక్కుంటున్నారా.. కొత్తది అంటే కొత్తది అని కాదు.. పాత దారే చూసుకుంటున్నారా. ప్రస్తుత BJP నాయకులు అడుగులు చూస్తుంటే అలగే అనిపిస్తోంది.
కనిపిస్తోంది.

వాస్తవానికి 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టిన BJPకి మంచి మేలు చేకూరింది. కంభంపాటి హరిబాబు లాంటివారు విశాఖ నించి ఎంపిలుగా గెలవగా తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన మాణిక్యాలరావు, కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ వంటి ఎమ్మెల్యేలు తీడిపి సర్కారులో మంత్రులు అయ్యారు.

అయితే మళ్ళీ BJP నాయకులకు మంత్రి యోగం పట్టాలంటే టీడీపీతో పొత్తు ఉండాలి..కలిసి ఎన్నికలకు వెళ్ళాలి.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది సాధ్యం అయ్యేలా లేదు.. TDP వెళ్తే గిల్తే జనసేనతో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటే ఉండేచ్చేమోగాని బీజేపీతో మాత్రం పొత్తు అవకాశాలు దాదాపు లేనట్లే తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక రాజకీయ భవిష్యత్ క్లోజ్ అయిపోతుందని భయపడ్డారో ఏమో వరుసగా టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ కట్టారని అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ మొన్ననే టిడిపిలో చేరి సత్తెనపల్లి టికెట్ కోసం రుమాలు వేసి ఉంచగా ఇక విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా అదే బాటలో వెళ్తారని అంటున్నారు.

అదే నిజమైతే వీళ్లకు ఎక్కడ సీట్ ఇస్తారు..అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పని చేస్తున్న టీడీపీ నాయకులను ఏమి చేస్తారన్నది అర్థం కావడం లేదు.. ఏదైతేనేం మొత్తానికి పలువురు BJP నాయకులు టీడీపీలోకి వెళ్లడం అయితే కన్ఫామ్ అని తెలుస్తోంది