Project K | ప్రభాస్.. ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా? నెట్టింట చక్కర్లు కొడుతున్న సరికొత్త టైటిల్
Project K: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబందించిన విషయాలకు ఓ స్పెషల్ ఇంటరెస్ట్ ఉంటుంది. ఇక సినిమాలకు సంబందించిన టైటిల్స్ కు కూడా మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ తో ప్రపంచవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసారు. నిజానికి ఈ మూవీ టైటిల్ లో ఆర్ఆర్ఆర్ అంటే రామ్ చరణ్, రామారావు, రాజమౌళి అనుకున్నారు. కానీ ఈ మూవీకి రౌద్రం రణం రుధిరం అని అనౌన్స్ చేసారు. దాని కన్నా కూడా […]

Project K:
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబందించిన విషయాలకు ఓ స్పెషల్ ఇంటరెస్ట్ ఉంటుంది. ఇక సినిమాలకు సంబందించిన టైటిల్స్ కు కూడా మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ తో ప్రపంచవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసారు.
నిజానికి ఈ మూవీ టైటిల్ లో ఆర్ఆర్ఆర్ అంటే రామ్ చరణ్, రామారావు, రాజమౌళి అనుకున్నారు. కానీ ఈ మూవీకి రౌద్రం రణం రుధిరం అని అనౌన్స్ చేసారు. దాని కన్నా కూడా ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ఏ జనాల్లోకి వెళ్లింది. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె టైటిల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతోంది.
ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో చేస్తున్నా సినిమా ఇది. ఈ సినిమాకు పెట్టిన వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కె బాగా హైలెట్ అయ్యింది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అసలు టైటిల్ ను ఓ బిగ్గెస్ట్ ఈవెంట్ లో అనౌన్స్ చేయబోతున్నారు.
శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టైటిల్ ను రివీల్ చేస్తారని ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ ఈవెంట్ జూలై 20 నుండి 23 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కె సినిమా టైటిల్ లీక్ అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. కాలచక్ర అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతుందట.
ఈ సినిమా టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఈ కాన్సెప్ట్ కి ఈ కాలచక్ర అనే టైటిల్ చాలా బాగా సూట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా వర్క్ చేస్తుంది. ఈ మూవీలో కమల్ హాసన్ కీలక రోల్ చేయడం విశేషం. మరో కీ రోల్ లో అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తున్నారు. అశ్విని దత్ ప్రొడ్యూసర్. ఇక ఈ సినిమాపై టైటిల్ పై వస్తున్న వార్తలకు ఫిల్మ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.