బళ్లారి టూ రామేశ్వరం కేఫ్
రామేశ్వరం కేఫ్‌లో జరిగిన టైమర్ బాంబు పేలుడుకు గతంలో 2023డిసెంబర్లో జరిగిన బళ్లారి పేలుడుకు మధ్య సంబంధం ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది

- రెండు పేలుళ్ల మధ్య సంబంధంపై అనుమానం
- ఎన్ఐఏ కస్టడీకి జైలులో ఉన్న నిందితుడు మీనజ్
విధాత : రామేశ్వరం కేఫ్‌లో జరిగిన టైమర్ బాంబు పేలుడుకు గతంలో 2023డిసెంబర్లో జరిగిన బళ్లారి పేలుడుకు మధ్య సంబంధం ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. రెండు పేలుళ్లు ఒకే తరహాలో జరిగినట్లుగా అనుమానిస్తున్న ఎన్ఐఏ ఇదే కోణంలో విచారణ కొనసాగిస్తుంది. జైలులో ఉన్న బళ్లారి పేలుళ్ల నిందితుడు మీనజ్ను ఎన్ఐఏ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అటు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి కోసం ఎన్ఐఏ ముమ్మర గాలింపు చేపట్టింది. నిందితుడు కర్నూల్ మంత్రాలయం మీదుగా బళ్లారికి చేరుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మంత్రాలయంలో నిందితుడి ఆచూకీ కోసం విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా నిందితుడి ఫోటోలను విడుదల చేసిన ఎన్ఐఏ ఆచూకీ చెప్పిన వారికి 10లక్షల రివార్డు ప్రకటించింది.