ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత.. ఒకేసారి 36 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో

ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఒకేసారి 36 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. వన్‌వెబ్ ఇండియా-2 మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలను మార్క్-3 (LVM 3) రాకెట్‌ ద్వారా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాలు వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందినవి కాగా.. బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి […]

ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత.. ఒకేసారి 36 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో

ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఒకేసారి 36 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. వన్‌వెబ్ ఇండియా-2 మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలను మార్క్-3 (LVM 3) రాకెట్‌ ద్వారా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాలు వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందినవి కాగా.. బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి వన్‌ వెబ్‌ ఇస్రో సహకారాన్ని తీసుకున్నది.

వన్‌వెబ్‌కు (Oneweb) చెందిన 5.8 టన్నులున్న 36 ఉపగ్రహాలను నింగిలోకి జీఎస్‌ఎల్వీ విజయవంతంగా మోసుకెళ్లింది. ఉదయం 9 గంటలకు రాకెట్‌ దూసుకెళ్లింది. 20 నిమిషాలు ప్రయాణించిన అనంతరం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిర్ధేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నది. ఆయా ఉపగ్రహాలను యూకేలోని (UK) గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు. రాకెట్‌ 43.5 మీటర్ల పొడవు, 643 బరువు టన్నులు. పూర్తిగా వాణిజ్య అవసరాలకోసం ఈ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా (New space India) లిమిటెడ్‌ యూకేకు చెందిన వన్‌వెబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

ఇందులో భాగంగా వన్‌వెబ్‌కు సంబంధించిన 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపాల్సి ఉండగా.. ఇందులో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్‌లో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో తాజాగా మిగతా 36 శాటిలైట్స్‌ను నింగిలోకి పంపింది. ఇందు కోసం జీఎల్‌ఎల్‌వీ వాహక నౌకను ఉపయోగించింది. జీఎస్‌ఎల్‌వీ అత్యంత బరువైన ఉపగ్రహాలను స్థిరకక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యం దీని సొంతం. ఇదిలా ఉండగా.. ప్రయోగం సందర్భంగా యూకే, అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగంలో పాల్గొన్నారు. ఎల్వీఎం-3 ప్రయోగం వీక్షించేందుకు సందర్శకులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. సందర్శకుల తాకిడితో సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కల్ జాతీయ రహదారిపై షార్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.