ఇస్రో SSLV-D2 ప్రయోగం విజయవంతం

విధాత : ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్‌వీ -2డీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని లాంచ్‌ప్యాడ్‌ నుంచి చిన్న ఉపగ్రహానికి నింగిలోకి పంపింది. రాకెట్‌లో 156.3 కిలోల బరువున్న EOS-07 ఉపగ్రహంతోపాటు అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను కక్ష్యలో ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో 785 […]

ఇస్రో SSLV-D2 ప్రయోగం విజయవంతం

విధాత : ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్‌వీ -2డీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని లాంచ్‌ప్యాడ్‌ నుంచి చిన్న ఉపగ్రహానికి నింగిలోకి పంపింది. రాకెట్‌లో 156.3 కిలోల బరువున్న EOS-07 ఉపగ్రహంతోపాటు అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను కక్ష్యలో ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్‌-07, 880 సెకన్లకు జానుస్‌-1, 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను ఇస్రో క్షక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మిషన్‌ శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు. ప్రయోగం విజయవంతమైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఉపగ్రహాలన్నీ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.