BRS ఎమ్మెల్సీ ఇంటిలో IT దాడులు.. భారీగా అక్రమ లావాదేవీల గుర్తింపు
రాజ్ పుష్ప వెంచర్‌లో ఐటీ సోదాలు విధాత: హైదరాబాద్‌లో నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు మొదలైన ఈ సోదాలు 13 గంటలుగా జరుగుతున్నాయి. రాజపుష్ప, ముప్పా, వర్టెక్స్, వసుధా ఫార్మా కంపెనీలతో సహా మొత్తం 51 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సిద్దిపేట మాజీ కలెక్టర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఆయన కుమారుడు, సోదరుడి ఇంట్లో, వారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ వెంచర్ […]

- రాజ్ పుష్ప వెంచర్‌లో ఐటీ సోదాలు
విధాత: హైదరాబాద్‌లో నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు మొదలైన ఈ సోదాలు 13 గంటలుగా జరుగుతున్నాయి. రాజపుష్ప, ముప్పా, వర్టెక్స్, వసుధా ఫార్మా కంపెనీలతో సహా మొత్తం 51 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
సిద్దిపేట మాజీ కలెక్టర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఆయన కుమారుడు, సోదరుడి ఇంట్లో, వారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ వెంచర్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు.
భారీగా పన్నులు ఎగవేశారన్న ఆరోపణలతో ఐదు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఉదయం నుంచి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ రిటర్నులతో పాటు.. కంపెనీ ఆర్థిక లావాదేవీలపై వివరాలు తెలుసుకుంటున్నారని సమాచారం.
భారీగా పన్నులు ఎగవేశారన్న ఆరోపణలతో అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా దాఖలు చేసిన ఐటీ రిటన్స్‌ను పరిశీలిస్తున్నారు. వాళ్లు లెక్కల్లో చూపిస్తున్న ఆదాయానికి వాస్తవంలో కనిపిస్తున్న దానికి పెద్ద మొత్తం వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం.
పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బ్లాక్‌లో తీసుకున్న నగదు మొత్తాన్ని దారి మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. తనిఖీలు జరుగుతున్న ప్రాంతాల్లోకి మీడియాను వెంచర్ నిర్వాహకులు అనుమతించడం లేదు.M