వంశీరామ్ బిల్డర్స్, దేవినేని అవినాశ్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు
హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులలో ఐటీ దాడులు విధాత: ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులలో ప్రముఖ బిల్డర్స్ వంశీరామ్ ఇండ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి పలు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇండ్లతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హై టెక్ సిటీతో పాటు విజయవాడలో మొత్తం 20కి పైగా బృందాలు 30 చోట్ల ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే విజయవాడలో హైదరాబాద్ […]

హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులలో ఐటీ దాడులు
విధాత: ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులలో ప్రముఖ బిల్డర్స్ వంశీరామ్ ఇండ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి పలు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు.
వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇండ్లతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హై టెక్ సిటీతో పాటు విజయవాడలో మొత్తం 20కి పైగా బృందాలు 30 చోట్ల ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
అలాగే విజయవాడలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గణదలలోని వైఎస్ ఆర్ సీపీ అధినేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించాయి. ఆయ సమయంలో తన నివాసంలోనే అవినాష్ ఉన్నారు.
అలాగే ఎమ్మెల్ల్యే వల్లభనేని వంశీ ఇంట్లోను ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో భారీ తేడాలున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది.