కేఏ పాల్‌తో కలిసి పనిచేస్తా: గద్దర్
విధాత, హైదరాబాద్: ప్రపంచ శాంతి కోసం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నెలకొల్పిన 'గ్లోబల్ హోస్ట్ సంస్థ'తో కలిసి పనిచేస్తానని ప్రజా గాయకుడిగా పేరు గాంచిన గద్దర్ అన్నారు. గ్లోబల్ హోస్ట్ కమిటీలో తనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ, జస్టిస్ చంద్రకుమార్, విమలక్కతో సహా మరో 12 మంది ఉన్నారన్నారు. తన 59 వ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 25వ తేదీ లోపు మునుగోడు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని కేఏ పాల్ ప్లాన్ […]

విధాత, హైదరాబాద్: ప్రపంచ శాంతి కోసం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నెలకొల్పిన ‘గ్లోబల్ హోస్ట్ సంస్థ’తో కలిసి పనిచేస్తానని ప్రజా గాయకుడిగా పేరు గాంచిన గద్దర్ అన్నారు.
గ్లోబల్ హోస్ట్ కమిటీలో తనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ, జస్టిస్ చంద్రకుమార్, విమలక్కతో సహా మరో 12 మంది ఉన్నారన్నారు.
తన 59 వ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 25వ తేదీ లోపు మునుగోడు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని కేఏ పాల్ ప్లాన్ చేస్తున్నారని గద్దర్ తెలిపారు