నెల్లూరు ఇంపాక్ట్.. అసంతృప్తులకు జగనన్న పిలుపు!

విధాత‌: ఓ చెడు ఇంకో మంచికి దారి తీస్తుందన్నట్లు ఉంది. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటివారు జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో పార్టీ హై కమాండ్ ఎలర్ట్స్ అయిన‌ట్టు ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం కొంపకు ఎసరు వస్తుందని గమనించిన జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలెట్టారని అంటున్నారు. జిల్లాల వారీగా ఇంకా ఇలాసన్తి వారు ఎవరున్నారు. వారి సమస్య ఏమిటి.. పిలిపించి […]

నెల్లూరు ఇంపాక్ట్.. అసంతృప్తులకు జగనన్న పిలుపు!

విధాత‌: ఓ చెడు ఇంకో మంచికి దారి తీస్తుందన్నట్లు ఉంది. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటివారు జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో పార్టీ హై కమాండ్ ఎలర్ట్స్ అయిన‌ట్టు ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం కొంపకు ఎసరు వస్తుందని గమనించిన జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలెట్టారని అంటున్నారు. జిల్లాల వారీగా ఇంకా ఇలాసన్తి వారు ఎవరున్నారు. వారి సమస్య ఏమిటి.. పిలిపించి కూర్చుని మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలని జగన్, ఇంకా పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇంతవరకూ జగన్ ఎన్నడూ పార్టీ నాయకులతో క్లోజ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఏదైనా మీటింగ్ ఉంటే తప్ప ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఇతర నాయకులతో జగన్ పెద్దగా వ్యక్తిగతంగా క్లోజ్ గా ఉండేవారు కాదు. దీంతో నాయకులు సైతం జగన్ తో దూరం పాటించక తప్పలేదు.

అయితే ఇప్పుడు నెల్లూరులో పుట్టిన కల్లోలంతో వైసీపీ హై కమాండ్ అప్రమత్తం అయింది. పార్టీకీ నాయకులకు మధ్య గ్యాప్ ఉందని గుర్తిస్తోంది. దాంతో అన్ని జిల్లాల్లోనూ ఇలా అసంతృప్తితో ఉన్నవాళ్లను గుర్తిస్తోంది. వారందరితో జగన్ నేరుగా మాట్లాడుతారు అని అంటున్నారు. వారి సమస్యలను అధినాయకుడు స్వయంగా విని గ్యాప్ ఫిల్లింగ్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు.

నిజానికి ఇప్పటిదాకా నాయకులు జగన్ను కలిసింది లేదు. అంతా పార్టీ సమన్వయకర్తలు చూసుకునేవారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య గొడవలు సైతం రీజినల్ కో ఆర్డినేటర్లు సెటిల్ చేస్తూ వస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతీయ కోఆర్డినేటర్ల శక్తి, యుక్తి సరిపోనపుడు ఆ పంచాయితీ జగన్ వరకూ వెళ్లాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో జిల్లాల్లో గొడవలు లోలోన అలాగే ఉంటున్నాయి. ఇవి ఏదోనాడు ఒకేసారి బహిర్గతమై మొత్తం పార్టీని ముంచేసే పరిస్థితి రావచ్చని అధినాయకత్వం భయపడుతోంది. ఇది ఇలా వదిలేస్తే ఒక వైరస్ మాదిరిగా పాకేసి అన్ని జిల్లాల్లో అసంతృప్తి రాగాలు శృతి మించుతాయని ఊహిస్తోంది.

దీంతో దీన్ని మొగ్గలోనే తుంచాలంటే జగన్ తో నేరుగానే మీటింగ్స్ ఏర్పాటు చేయించాలని పార్టీ బాధ్యులు నిర్ణయించారని తెలుస్తోంది. దానికి జగన్ సైతం ఓకే అనడంతో తొందరలోనే అసంతృప్తి గళాలు ఎన్ని ఉన్నాయి అని చూసి అలాంటి వారిని జగన్ తో భేటీ చేయించేలా చూస్తున్నారు.