సిమ్ కార్డుకు.. త‌ప్పుడు ప‌త్రాలిస్తే జైలే..!

విధాత: దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క‌రు రెండు నుంచి మూడు సిమ్‌ల‌ను మెయింటెన్ చేస్తున్నారు. ఇలా సిమ్‌లు ఉప‌యోగించే వారు ఒక్కోసారి త‌ప్పుడు ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఇలాంటి వారిని కేంద్రం హెచ్చ‌రించింది. సిమ్ కార్డు పొందేందుకు త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే ఏడాది పాటు జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే వాట్సాప్, సిగ్న‌ల్, టెలిగ్రాం వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల‌లో న‌కిలీ ఐడీలు వాడినా ఏడాది జైలు శిక్ష లేదా […]

  • By: krs    latest    Sep 30, 2022 5:19 AM IST
సిమ్ కార్డుకు.. త‌ప్పుడు ప‌త్రాలిస్తే జైలే..!

విధాత: దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క‌రు రెండు నుంచి మూడు సిమ్‌ల‌ను మెయింటెన్ చేస్తున్నారు. ఇలా సిమ్‌లు ఉప‌యోగించే వారు ఒక్కోసారి త‌ప్పుడు ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఇలాంటి వారిని కేంద్రం హెచ్చ‌రించింది.

సిమ్ కార్డు పొందేందుకు త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే ఏడాది పాటు జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే వాట్సాప్, సిగ్న‌ల్, టెలిగ్రాం వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల‌లో న‌కిలీ ఐడీలు వాడినా ఏడాది జైలు శిక్ష లేదా రూ. 50 వేలు జ‌రిమానా విధించ‌నున్న‌ట్టు టెలికం బిల్లు ముసాయిదాలో కేంద్రం నిబంధ‌న‌లు పొందుప‌రిచింది.

గ‌త కొద్ది కాలం నుంచి ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు పెరిగిన నేప‌థ్యంలో ఈ నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు కేంద్రం తెలిపింది. ఇక‌నుంచి అన్ని ఓటీటీ ప్లాట్‌‌ఫాంలు యూజర్‌ వివ‌రా‌లతో కూడిన కేవై‌టీలు తప్ప‌ని‌స‌రిగా సేక‌రిం‌చాల్సి ఉంటుంది.