Jailer Producer | ఈ జాలి గుండె రేర్‌గా ఉంటుంది.. ‘జైలర్’ లాభాలతో కళానిధి మారన్ ఏం చేశారంటే..

Jailer Producer | లాభాలు వస్తే మా జేబులోకి, నష్టాలు వస్తే మీ ఖాతాలోకి అనే ధోరణిలో నడిచే బిజినెస్ సినిమా బిజినెస్. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నిర్మాత చేతిలో ఉండదు. ప్రతి నిర్మాత లాభాలు రావాలనే సినిమాలు చేస్తుంటాడు. సినిమా అనగానే నిర్మాతగా డబ్బులు మాత్రమే కాకుండా.. కాస్త ప్యాషన్ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేదానికి ఉదాహరణ ‘జైలర్’ నిర్మాతనే చూపించాలి. ‘జైలర్’ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టగానే ఆ […]

  • By: krs    latest    Sep 08, 2023 8:30 AM IST
Jailer Producer | ఈ జాలి గుండె రేర్‌గా ఉంటుంది.. ‘జైలర్’ లాభాలతో కళానిధి మారన్ ఏం చేశారంటే..

Jailer Producer |

లాభాలు వస్తే మా జేబులోకి, నష్టాలు వస్తే మీ ఖాతాలోకి అనే ధోరణిలో నడిచే బిజినెస్ సినిమా బిజినెస్. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నిర్మాత చేతిలో ఉండదు. ప్రతి నిర్మాత లాభాలు రావాలనే సినిమాలు చేస్తుంటాడు. సినిమా అనగానే నిర్మాతగా డబ్బులు మాత్రమే కాకుండా.. కాస్త ప్యాషన్ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేదానికి ఉదాహరణ ‘జైలర్’ నిర్మాతనే చూపించాలి.

‘జైలర్’ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టగానే ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఊరుకోలేదు ఆ నిర్మాత. విజయంతో దక్కిన సొమ్మును పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలకు వినియోగించడం అంటే అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. జైలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీ నిర్మాతలు ఈ విజయాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించి, ప్రేక్షకుల దృష్టిలో హీరోలవుతున్నారు. విషయంలోకి వెళితే..

అరవై దాటేసినా ఇంకా యంగ్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులేస్తూ, యాక్షన్ సీన్స్ చేస్తూ మంచి హుషారుగా నటిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఈమధ్య చేసిన మూవీ జైలర్, ఇది ఇప్పటికే 650 కోట్లు రాబట్టింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జైలర్ అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

అయితే ఈమూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లాభాలను సన్ పిక్చర్స్ సంస్థ అందరితోనూ పంచుకుంది. ఈ సక్సెస్‌లో కీ రోల్ పోషించిన రజనీ కాంత్, డైరెక్టర్ దిలీప్ నెల్సన్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. రజనీకాంత్‌కు చెక్‌తో పాటు రూ.1.55 కోట్లు విలువచేసే BMW X7 కారును.. నెల్సన్‌, అనిరుధ్‌లకు కోటి రూపాయల పోర్షే మకాన్ లగ్జరీ కార్లతో పాటు చెక్‌ను అందించారు.

ఈ లాభాలలో కొంత సామాజిక సేవా కార్యక్రమాల కోసం కూడా వినియోగిస్తున్నారు నిర్మాత కళానిధి మారన్. తాజాగా ఆయన అపోలో ఆస్పత్రికి కోటి రూపాయలను విరాళంగా అందించారు. నిర్మాత కళానిధి మారన్.. ఆయన భార్య కావేరి‌తో అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌, డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డికి రూ. కోటి చెక్‌‌ని అందించారు. ఈ డబ్బుతో పేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్స చేయాలని కోరినట్లుగా సన్ పిక్చర్స్ సంస్థ అధికారిక ట్విట్ చేసింది.

ఈ సాయం విషయం తెలియగానే సోషల్ మీడియాలో సన్ పిక్చర్స్ సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నారని, లాభాలతో ఇలాంటి మంచి పని చేయాలని అనుకోవడం, సాయం అందించడం అందరికీ అయ్యేపని కాదని.. కళానిధి మారన్‌ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.