తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.. జైని మల్లయ్య గుప్తా కన్నుమూత

విధాత: తెలంగాణ సాయుధ పొరాట యోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దివిటి, సాహితీ అభిమాని జైని మల్లయ్య గుప్త(97) నిన్న రాత్రి 10.00 గంటలకు మరణించారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో నెలకొన్న అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య గుప్తా తుది శ్వాస విడిచారు. కామ్రేడ్ జై ని మల్లయ్య గుప్తా తెలంగాణ సాయుధ పోరాటంలో భువనగిరి ఆంధ్ర మహాసభల నిర్వహణలో భువనగిరి తాలూకాలో నైజాం వ్యతిరేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు గ్రంధాలయ ఉద్యమాల విస్తరణకు సాహిత్య రంగానికి ఆయన విశేష […]

  • By: krs    latest    Dec 21, 2022 5:00 PM IST
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.. జైని మల్లయ్య గుప్తా కన్నుమూత

విధాత: తెలంగాణ సాయుధ పొరాట యోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దివిటి, సాహితీ అభిమాని జైని మల్లయ్య గుప్త(97) నిన్న రాత్రి 10.00 గంటలకు మరణించారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో నెలకొన్న అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య గుప్తా తుది శ్వాస విడిచారు.

కామ్రేడ్ జై ని మల్లయ్య గుప్తా తెలంగాణ సాయుధ పోరాటంలో భువనగిరి ఆంధ్ర మహాసభల నిర్వహణలో భువనగిరి తాలూకాలో నైజాం వ్యతిరేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు గ్రంధాలయ ఉద్యమాల విస్తరణకు సాహిత్య రంగానికి ఆయన విశేష సేవలు అందించారు

1996లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇండియా మిషన్ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన 3 రోజుల ఉద్యమ సదస్సు కోసం జైని మల్లయ్య గారు ప్రధాన భూమిక పోషించారు. భువనగిరి సదస్సు మలిదశ తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగా నిలిచింది.

వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించిన వ్యక్తి మల్లయ్య గుప్త . ఆయన మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు సాహితీ అభిమానులు తీవ్ర విచారం సంతాపం వ్యక్తం చేశారు.

చైత‌న్య జ్వాల జైని మ‌ల్ల‌య్య గుప్త‌