Jammu and Kashmir |
జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ యాత్రికులతో వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జజ్జర్ కొట్లీ ప్రాంతంలో భారీ లోయలోకి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 16 మంది గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Eight died more than 40 injured when a #bus carrying passengers met with an #accident at #JhajjarKotli area on Jammu Srinagar highway #JammuAndKashmir pic.twitter.com/AUvAeC2GGO
— Gowher Ali (@gowherAly) May 30, 2023
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమృత్‌సర్ నుంచి వస్తున్న వీరంతా.. మరో 15 నిమిషాలు ప్రయాణిస్తే కాట్రా క్యాంపునకు చేరుకునే వారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.