చాన్నాళ్లకు జనసేన, బీజేపీ భేటీ..పవన్ హాజరవుతారా!
విధాత: అసలు జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఉన్నాయా లేదో తెలీదు. బీజేపీ మాత్రం పవన్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తుండగా ఆయన మాత్రం చంద్రబాబు వైపు మొగ్గుతున్నారు. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయ్. పొత్తుల సంగతి తేలలేదు. అసలు బీజేపీ.. జనసేన కలిసి కూచుని మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నాళ్ళయిందో తెలీదు. అందుకే మళ్ళీ ఆ రెండు పార్టీలు కలిసి చర్చించుకుని వ్యూహం సిద్ధం చేస్తారని అంటున్నారు. ఈమేరకు రేపు.. అంటే డిసెంబర్ 25న ముహూర్తం ఫిక్స్ […]

విధాత: అసలు జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఉన్నాయా లేదో తెలీదు. బీజేపీ మాత్రం పవన్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తుండగా ఆయన మాత్రం చంద్రబాబు వైపు మొగ్గుతున్నారు. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయ్. పొత్తుల సంగతి తేలలేదు. అసలు బీజేపీ.. జనసేన కలిసి కూచుని మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నాళ్ళయిందో తెలీదు. అందుకే మళ్ళీ ఆ రెండు పార్టీలు కలిసి చర్చించుకుని వ్యూహం సిద్ధం చేస్తారని అంటున్నారు. ఈమేరకు రేపు.. అంటే డిసెంబర్ 25న ముహూర్తం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. దీంతో వీరి బంధం ఎంత బలంగా ఉందొ.. మున్ముందు ఎలా ప్లాన్ చేస్తారన్నది ఒక ఐడియా వస్తుంది.
వాస్తవానికి 2020 జనవరిలో పవన్ బీజేపీల పొత్తు కుదిరింది. అది జరిగిన తరువాత రెండు పార్టీల మధ్య ఒక సమావేశం జరగ్గా దానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ తరువాత 2021లో మరో మీటింగ్ జరిగితే జనసేన నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఆ తరువాత ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగాయి. అయినా సరే రెండు పార్టీలు కలిసి మాట్లాడుకోలేదు . అసలు ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయన్న సంగతి కూడా కార్యకర్తలతోబాటు జనం కూడా మరిచారు.
ఆ తరువాత మళ్ళీ మొన్న నవంబర్ 11న విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ భేటీ అయ్యారు. ఆ తరువాత విజయనగరంలో పవన్ పర్యటనలో ఆయన దూకుడు చూశాక ఆయన బీజేపీతోనే వెళ్తారన్న ఊహలు వెల్లువెత్తాయి. కానీ మళ్ళీ ఈమధ్య పవన్ మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అంటున్నారు.
దీంతో మళ్ళీ పవన్ రాజకీయ ఆలోచనాలమీద సందేహాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో వాజపేయి జన్మదినం నాడు అంటే డిసెంబర్ 25న ఇరుపార్టీల పెద్దలు మాట్లాడుకుంటారని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల 25న మీటింగ్‌కి పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారా నాదెండ్ల మనోహర్‌ని పంపుతారా అన్నది కూడా చర్చగా ఉంది.